Tollywood: ఈ అందాల తారల ఆస్తులు ఎంతో తెలుసా ?.. భారతదేశంలో అత్యంత సంపన్న నటి ఎవరంటే..
మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీ.. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ సినిమాతో కథానాయికగా అడుగుపెట్టింది. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అలాగే ఒక ప్రకటనకు దాదాపు రూ.7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. . ఐశ్వర్యరాయ్ భారతదేశంలోనే అత్యంత సంపన్న నటి. ఇప్పటివరకు ఆమె సంపాదన మొత్తం దాదాపు రూ. 800 కోట్లు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గురించి పరిచయం అవసరం లేదు. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీ.. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ సినిమాతో కథానాయికగా అడుగుపెట్టింది. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అలాగే ఒక ప్రకటనకు దాదాపు రూ.7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. . ఐశ్వర్యరాయ్ భారతదేశంలోనే అత్యంత సంపన్న నటి. ఇప్పటివరకు ఆమె సంపాదన మొత్తం దాదాపు రూ. 800 కోట్లు.
ప్రియాంక చోప్రా..
మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా జోన్స్ ఐశ్వర్యరాయ్ తర్వాత రెండవ అత్యంత సంపన్న నటి. ఆమె ఆస్తి విలువ రూ. 600 కోట్లు. అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లాడి అమెరికాలో స్థిరపడిన ప్రియాంక హాలీవుడ్ సినిమాల్లో నటించడమే కాకుండా అమెరికాలో ఓ రెస్టారెంట్‌ను నడుపుతోంది. అలాగే ఆమె కాస్మోటిక్స్ కంపెనీ, దుస్తుల కంపెనీని కలిగి ఉంది.
అలియా భట్..
ప్రియాంక చోప్రా తర్వాతి స్థానంలో ఉన్నది ఆలియా భట్. నిర్మాత మహేష్ భట్ కూతురు అయిన అలియా ఆస్తుల విలువ రూ.550 కోట్లు. ఒక్కో సినిమాకు రూ. 9 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే ఆమె ప్రకటన ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తుంది. ఇవి కాకుండా..అలియా భట్ తన సొంతంగా దుస్తుల కంపెనీ కలిగి ఉంది. ఈ వ్యాపారంలో ఆమె కోట్లు సంపాదిస్తోంది.
దీపికా పదుకొణె..
అలియా తర్వాతి స్థానంలో హీరోయిన్ దీపికా పదుకొణె ఉంది. ఇప్పటివరకు ఆమె దాదాపు రూ.500 కోట్ల ఆస్తి కలిగి ఉంది. ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో దీపిక ఒకరు. అలాగే పెద్ద కంపెనీల యాడ్ ఫిలిమ్స్ లో నటిస్తుంది. దీపిక కూడా ఓ బ్యూటీ కంపెనీని నిర్వహిస్తోంది.
కరీనా కపూర్..
సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా కపూర్ భారత దేశంలో అత్యంత సంపన్న నటీమణుల జాబితాలో 5వ స్థానంలో ఉంది. ఆమె ఆస్తి విలువ రూ. 485 కోట్లు. రూ.కోటి నుంచి రూ.10 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలాగే యాడ్ ఫిల్మ్ లో నటించడానికి రూ. 6 కోట్లు తీసుకుంటుంది. .
కత్రీనా కైఫ్..
ఈ జాబితాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ 6వ స్థానంలో ఉంది. హీరో విక్కీ కౌశల్‌ని పెళ్లాడిన కత్రినా కైఫ్.. ఒక్క సోనిమాకు రూ. 8 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. అలాగే ఆమె కే అనే బ్యూటీ ఉత్పత్తుల కంపెనీ కలిగి ఉంది. దాని ద్వారా రూ. 100 కోట్లు సంపాదిస్తుంది. కత్రీనా ఆస్తులు రూ.430 కోట్లు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
