Tollywood: ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పెన్షన్ కూడా.. ఈ స్టార్ హీరో ఎవరంటే?
ఓ దిగ్గజ నటుడి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ నటుడికి ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా లభిస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఇతను కూడా ఒకడు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో వరుసగా అపజయాలు ఎదుర్కొన్నాడు. కొన్నేళ్ల పాటు సక్సెస్ ముఖం చూడలేకపోయాడు. అయితే రెండేళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాతో మళ్లీ విజయాల బాట పట్టాడు. ఆ సక్సెస్ ను కొనసాగిస్తూ ఇటీవలే మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడీ స్టార్ హీరో. అయితే ఈ నటుడు భారత ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా అందుకుంటున్నాడు. అతను మరెవరో కాదు గదర్ 2, జాట్ సినిమాలతో స్ట్రాంగ్ కమ్ బ్యాట్ ఇచ్చిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్.
సన్నీ డియోల్ గతంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా పని చేశారు. 2019లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బిజెపి టికెట్‌పై పోటీ చేసి గెలిచాడీ స్టార్ నటుడు. 2019 నుండి 2014 వరకు లోక్‌సభ ఎంపీ గా బాధ్యతలు నిర్వర్తించారు. లోక్ సభ సభ్యుడిగా అతని పదవీకాలం జూన్ 2024లో ముగిసింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ హోదాలో సన్నీకి భారత ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పెన్షన్ లభిస్తోంది. గతంలో మన దేశంలో మాజీ ఎంపీలు నెలకు రూ.25,000 పెన్షన్ పొందేవారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.31,000కి పెంచారు. అలా ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి నెలకు రూ.31,000ల పెన్షన్ కూడా పొందుతున్నాడు సన్నీ డియోల్.
సోదరితో సన్నీ డియోల్..
View this post on Instagram
పెన్షన్‌తో పాటు ఓ మాజీ ఎంపీ హోదాలో సన్నీ డియోల్‌కు భారత ప్రభుత్వం పలు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ నటుడికి లైఫ్ టైమ్ రైల్ పాస్ లభిస్తుంది. దీని ద్వారా అతను తన భార్య లేదా మరొకరితో కలిసి ఫస్ట్ క్లాస్ AC లేదా ఎగ్జిక్యూటివ్ కోచ్ లో జీవితాంతం ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనితో పాటు, మాజీ ఎంపీ అయిన సన్నీ డియోల్ ప్రభుత్వ లెటర్‌హెడ్, ఉచిత పోస్టల్ సేవలను కూడా పొందుతాడు. అలాగే ప్రభుత్వ పని లేదా వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీలో వసతి సౌకర్యాలు అందుబాటులో కూడా ఉన్నాయి. ప్రభుత్వ అతిథి గృహాలలో మాజీ ఎంపీలు మాత్రమే తక్కువ ధరలకు గదులు పొందగలరు. అంటే మాజీ ఎంపీ సన్నీ డియోల్ కూడా ఈ సౌకర్యాన్ని పొందుతారు.
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. సన్నీ డియోల్ ప్రస్తుతం ‘బోర్డర్ 2’, ‘లాహోర్ 1947’ ‘రామాయణం పార్ట్ 1’, పార్ట్ 2 సినిమాల్లో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








