Tollywood: అప్పుడు రూ.500తో ఇండస్ట్రీకి.. ఇప్పుడు రూ. 35 కోట్లతో క్రేజీ హీరోగా.. ఈ యాక్టర్ ఎవరో తెలుసా.?
ఈ నటుడు భోజ్‌పురి సినిమాలో పెద్ద స్టార్ హీరో. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో కూడా పని చేశారు. తనదైన శైలి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు రూ. 500తో ఇండస్ట్రీకి.. ఇప్పుడిలా..! ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.

బాల్యంలో తీవ్ర పేదరికం, ఆర్ధిక ఇబ్బందులతో గడిపాడు. మొదటి నుంచి నటన, నృత్యం అంటే ఇష్టం. ఈ నటుడు భోజ్‌పురి సినిమాలో స్టార్ హీరోగా ఎదిగాడు. హిందీ సినిమాలతో పాటు దక్షిణ సినిమాలలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు మరెవరో కాదు స్టార్ హీరో, బీజేపీ ఎంపీ రవి కిషన్. ఒకప్పుడు కేవలం 500 రూపాయలతో ముంబైకి వచ్చిన ఈ హీరో.. ఇప్పుడు కోట్ల సంపాదనతో క్రేజీ హీరోగా ఎదిగాడు.
రవి కిషన్ 500 రూపాయలతో ముంబైకి..
1969 జూలై 17న ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో జన్మించిన రవికిషన్.. తొలుత తాను నటుడు అవ్వాలని తండ్రికి చెప్పగా.. ఆయన దానికి వ్యతిరేకించారు. రవికిషన్ నటుడిగా మారాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాడు. ఒకసారి తన కొడుకు రామ్ లీలలో మాతా సీత పాత్ర పోషిస్తున్నాడని అతడి తండ్రికి తెలిసి.. రవికిషన్‌ను తీవ్రంగా కొట్టారు. ఆపై 500 రూపాయలతో ముంబైకి వచ్చాడు. ఇప్పుడు కోట్ల సంపద సంపాదించాడు. గొప్ప నటుడిగా అవ్వడమే కాదు.. ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు సేవ చేస్తున్నాడు. 2024లో భారతీయ జనతా పార్టీ టికెట్‌పై గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో అతడు గెలిచాడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, రవి నికర ఆస్తుల విలువ దాదాపు రూ.35 కోట్లు. ముంబై, గోరఖ్‌పూర్, జౌన్‌పూర్‌లలో కలిపి మొత్తంగా రవికి మొత్తం 11 ఇళ్ళు ఉన్నాయి. నటుడి దగ్గర ఫార్చ్యూనర్, మెర్సిడెస్ బెంజ్, BMW, జాగ్వార్, ఇన్నోవా వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
రవి కిషన్ సినీ జీవితం..
రవి కిషన్ భోజ్‌పురి సినిమాల విషయానికొస్తే.. ‘దేవ్రా బడా సతవేలా’, ‘హమర్ దేవదాస్’, ‘కేహు హమ్సే జీత్ నా పాయీ’, ‘పియావా బడా సతవేలా’ వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో ‘తేరే నామ్’, ‘ముక్కేబాజ్’, ‘బుల్లెట్ రాజా’, ‘వెల్ డన్ అబ్బా’, ‘ఫిర్ హేరా ఫేరీ’ వంటి చిత్రాలలో నటించాడు. దక్షిణాదిలో ‘రేసు గుర్రం’, ‘సుప్రీమ్’, ‘ఒక్క అమ్మాయి తప్ప’, ‘హెబ్బులి’, ‘లై’ వంటి చిత్రాలలో కనిపించాడు.
View this post on Instagram
ఇది చదవండి: స్టార్ హీరో అయితే నాకేంటి.! లిప్‌లాక్ సీన్ వద్దని తెగేసి చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




