Sanya Malhotra: హిందీలోకి ‘హిట్’ మూవీ రీమేక్.. దిల్‌రాజు సినిమాలో నటించనున్న ‘దంగల్’ బ్యూటీ..
తెలుగులో హీరో నాని నిర్మించిన "హిట్" సినిమా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన
తెలుగులో హీరో నాని నిర్మించిన “హిట్” సినిమా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు ఇందులో హీరోగా నటిస్తున్నారు. “మాతృక”కు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిట్ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై దిల్ రాజు, భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్‌లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో ఈ చిత్రానికి మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో “దంగల్” బ్యూటీ సన్యా మల్హోత్ర హీరోయన్‌గా నటిస్తున్నారు. తెలుగులో రుహాని శర్మ పోషించిన పాత్రలో సన్యా నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ”#HIT టీమ్ లోకి సన్యా కు స్వాగతం” అని ట్వీట్ చేశారు మేకర్స్. అలాగే హిట్ మూవీ తనకు చాలా నచ్చిందని.. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చిందని.. అందుకే ఈ మూవీ ఆఫర్ రాగానే ఓకే చెప్పినట్లుగా సన్యా చెప్పుకోచ్చింది. హీరో రాజ్ కుమార్ రావుతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. అమీర్ ఖాన్ దంగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సన్యా మల్హోత్రా.. ఆ తర్వాత “పటాఖా”…” బాధాయ్ హో”, “శకుంతలా దేవి”, “లూడో” వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ట్వీట్..
Welcome to the #HIT team @sanyamalhotra07!@RajkummarRao @sanyamalhotra07 @KolanuSailesh #BhushanKumar @TSeries @DilRajuProdctns @SVC_official #KrishanKumar @kuldeeprathor9 @tuneintomanan pic.twitter.com/r72Q1Mtck6
— Dil Raju Productions (@DilRajuProdctns) July 9, 2021
Murder: దారుణ హత్య.. వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు