Amitabh Bachchan: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’.. అమితాబ్‌పై ఆగ్రహం.. జరిమానా కట్టండంటూ..
ఇందులో తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా అమితాబ్ బచ్చన్ వినియోగదారులను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. యాడ్ వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉందని, తప్పుడు సమాచారం ఉందని, ఆ యాడ్ ఇచ్చిన కంపెనీకి జరిమానా విధించడమే కాకుండా, ఆ యాడ్‌లో నటించి తప్పుడు సమాచారం అందించిన నటుడు అమితాబ్ బచ్చన్‌కు రూ.10 లక్షల జరిమానా విధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆన్ స్క్రీన్ అయినా , ఆఫ్ స్క్రీన్‌పైనా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్న బిగ్‌బీ అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అవును, నటుడు అమితాబ్ బచ్చన్ ఒక ప్రకటనలో అబద్ధం చెప్పారని, వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, చిన్న, మధ్య తరహా హోల్‌సేల్ వ్యాపారులకు నష్టం కలిగించే ప్రకటన చేశారని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ (CAIT) పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్ అంబాసిడర్‌గా ఉన్న నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలో కనిపించారు. ప్రకటన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే గురించి. నాణ్యమైన, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరకే అందిస్తామంటూ ఈ ప్రకటనలో తెలిపారు. అయితే ఇందులో తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా అమితాబ్ బచ్చన్ వినియోగదారులను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. యాడ్ వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉందని, తప్పుడు సమాచారం ఉందని, ఆ యాడ్ ఇచ్చిన కంపెనీకి జరిమానా విధించడమే కాకుండా, ఆ యాడ్‌లో నటించి తప్పుడు సమాచారం అందించిన నటుడు అమితాబ్ బచ్చన్‌కు రూ.10 లక్షల జరిమానా విధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఫ్లిప్‌కార్ట్‌ను డిమాండ్ చేశారు.
ఇక యాడ్ విషయానికొస్తే.. ఓ ఆఫీస్‌లో సంభాషణ జరుగుతుంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సందర్భంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపుతో గొప్ప ఆఫర్లు ఉన్నాయని ఒకరు చెబుతుండగా.. పక్కనే ఉన్న మరొకరు షాప్ కూడా ఆ ఆఫర్లు ఇస్తున్నాయంటాడు. అయితే వెంటనే అక్కడ ప్రత్యక్షమైన అమితాబ్ బచ్చన్.. ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఆఫర్‌లను స్టోర్ ఇవ్వలేదని, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే రోజున మాత్రమే అలాంటి ఆఫర్‌లు లభిస్తాయంటారు. ఈ ప్రకటన టోకు వ్యాపారులను దెబ్బతీసే విధంగా ఉందటూ బచ్చన్‌పై వ్యాపారులు ఫిర్యాదు చేశారు. ఆఫ్‌లైన్ స్టోర్‌లు కూడా ఆన్‌లైన్ స్టోర్ల మాదిరిగానే ఆఫర్‌లను అందిస్తున్నాయని ల్ ఇండియా మర్చంట్స్ యూనియన్ తెలిపింది. కాగా సోషల్ మీడియాలో బచ్చన్ ప్రకటనపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వివాదం రేకెత్తించిన యాడ్ ఇదే..
Shri @SrBachchan ji,
STOP HURTING SMALL BUSINESSES!
You are the greatest showman of Bharat, which also means you have tremendous responsibility towards the nation and the citizens. In this advertisement for Flipkart you are demeaning the retailers of our nation by making… pic.twitter.com/wtHQkuw8M2
— Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) September 30, 2023
వ్యాపారుల ఆగ్రహం..
📢 AIMRA India condemns the misleading advertisements by @SrBachchan for #Flipkart, and millions of shopkeepers seek immediate correction! 🛍️ We expect our Mahanayak to stand by the country’s traders and avoid damaging their business with deceptive ads. 🙏 #StopMisleadingAds… pic.twitter.com/5Ex9Y6jINC
— ALL INDIA MOBILE RETAILERS ASSOCIATION (@AimraIndia) September 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.