Aishwarya Rai: ఐశ్వర్యా రాయ్ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే? వీడియో
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ కారు ప్రమాదానికి గురైంది. బుధవారం (మార్చి26) ఆమె ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన ఐష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జుహులోని ఐశ్వర్య నివాసం సమీపంలో జరిగింది. అయితే ఈ ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారనే సమాచారం కూడా అధికారికంగా బయటకు రాలేదు. మరోవైపు కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఒక కారును బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ కారు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ది అని స్థానికులు చెబుతున్నారు. బస్సు కారుని ఢీకొట్టిన తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత బాడీ గార్డ్స్ కారును అక్కడే వదిలేశారని కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే కారుకు కూడా ఎటువంటి నష్టం జరగకపవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కారులో ఐష్ లేదని సమాచారం.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ చివరిసారిగా దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడు కోణార్క్ వివాహానికి హాజరయ్యారు. కోణార్క్ తన స్నేహితురాలు నియాతిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి బచ్చన్ కుటుంబం మొత్తం హాజరయ్యారు. ఆ పెళ్లికి సంబంధించిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా, నటుడు సోను సూద్ భార్య సోనాలి సూద్ గత సోమవారం ఒక ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె ఇప్పుడు కోలుకుంటోంది. నటుడు సోను సూద్ తన భార్య ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోపే ఐశ్వర్య రాయ్ కారు కూడా ప్రమాదానికి గురి కావడం కొసమెరుపు.
నడి రోడ్డుపై ఐశ్వర్యా రాయ్ కారు..
Aishwarya Rai Bachchan’s car was hit from behind by a BEST bus in Mumbai’s Juhu area on Wednesday. However, reports confirm that Aishwarya was not in the car at the time of the incident. As per reports it was a minor mishap with no damage to the car or injuries to anyone. The… pic.twitter.com/LrbSKCaT3E
— News9 (@News9Tweets) March 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.