Childhood Pic: తాత అమ్మమ్మలతో ఈ రోజు బర్త్‌డే బాయ్ రామ్ చరణ్.. ఎక్కడ ఉన్నాడో.. గుర్తు పట్టారా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాతయ్య అమ్మమ్మలైన అల్లు రామలింగయ్య కనకరత్నం తో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలో తాతతో ఉన్న పిల్లల్లో ఒకరు మెగాస్టార్ స్టార్ ముద్దుల తనయుడు రామ్ చరణ్. ఎక్కడ ఉన్నాడో గుర్తు పట్టరా అంటూ మెగా అభిమానులకు చాలెంజ్ ని విసురుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు ఏకైక తనయుడు రామ్ చరణ్ బ్లడ్ లోనే నటన ఉంది. తండ్రి మెగాస్టార్ చిరంజీవి.. తాత లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అత్యుత్తమ రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత. అల్లుడు చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరో. తర్వాత జనరేషన్ కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఒక వైపు కూతురు కొడుకు రామ్ చరణ్.. మరోవైపు కొడుకు కొడుకు అల్లువారి వారసుడిగా అల్లు అర్జున్ సహా అల్లు హీరోలు, మరోవైపు మెగా హీరోలు తెలుగు తెరపై సందడి చేస్తున్నారు.
రామ్ చరణ్ మార్చి 27, 1985న చెన్నైలో జన్మించారు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్‌లో చదువుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాలేజీలో చదువు పూర్తి చేశారు. ముంబై కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్న రామ్ చరణ్ చిరుత సినిమాతో వెండి తెరపై హీరోగా అడుగు పెట్టాడు.
రామ్ చరణ్ 2007 లో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘చిరుత’ చిత్రంతో హీరోగా వెండి తెరపై అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి, చరణ్ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. చేస్తున్న ప్రతి సినిమాతో తన ఇమేజ్‌ను పెంచుకుంటూనే ఉన్నాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌తో వెండి తెరపై అడుగు పెట్టినా.. తనదైన శైలిలో హీరోగా మెప్పించడానికి ప్రయత్నిస్తూ.. అసలు సిసలైన వారసుడిగా ఎదిగాడు.
మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా తెలుగు సినిమాకి పరిచయమైనప్పటికీ వివిధ రకాల జోనర్‌లను ప్రయత్నిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. చరణ్ తన రెండో సినిమాగా రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీరతో ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ను సాధించాడు. సుకుమార్ యొక్క గ్రామీణ యాక్షన్ చిత్రం ‘రంగస్థలం’లో తన ఉత్తమ నటనను ప్రదర్శించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. తండ్రిని మించిన తనయుడిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. గేమ్ చెంజర్ సినిమా నిరస పరిచినా రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 16 సినిమాలో నటిస్తున్నాడు. తన సినీ జీవితంలో, రామ్ చరణ్ నంది, జీ సినిమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, SIIMA, సంతోషం ఫిల్మ్ అవార్డ్స్, ఆసియా విజన్ అవార్డు, NDTV ట్రూ లెజెండ్, జీ సినీ అవార్డ్స్ తెలుగు, క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ వంటి అనేక అవార్డులను గెలుచుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..