Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఇటువంటి లక్షణాలున్న స్త్రీ.. ఇల్లాలుగా దొరికితే అదృష్టమే..

గరుడ పురాణంలో పేర్కొన్న విషయాలను అనుసరించడం మంచి జీవితాన్ని గడప వచ్చు. జీవితంలో ఏది సరైనది? ఏది తప్పు అనే విషయాలను గుర్తించ వచ్చు. తద్వారా ధర్మ మార్గాన్ని, కర్మ మార్గాన్ని అనుసరించి మంచి జీవితాన్ని గడపవచ్చు. గరుడ పురాణంలో స్వర్గం, నరకం, కర్మల గురించి మాత్రమే కాదు.. మనిషులకు ఉండాల్సిన లక్షణాలు కూడా చెప్పారు. ఈ రోజు గరుడ పురాణంలో చెప్పిన స్త్రీకి ఉండవలసిన లక్షణాల గురించి తెలుసుకుందాం..

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఇటువంటి లక్షణాలున్న స్త్రీ.. ఇల్లాలుగా దొరికితే అదృష్టమే..
Garuda Puranam
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2025 | 12:21 PM

హిందూ మతంలో మొత్తం నాలుగు వేదాలు.. 18 మహా పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. అందులో మానవ జీవితానికి, మరణానికి సంబంధించిన అనేక రహస్యాలను పేర్కొన్నారు. ఈ పురాణంలో పేర్కొన్న విషయాలను తెలుసుకుని.. వాటిని పాటించడం ద్వారా మంచి చెడులను, తప్పు ఒప్పులను గుర్తించవచ్చు. అదే విధంగా గరుడ పురాణం ప్రకారం స్త్రీకి ఉండాల్సిన లక్షణలు గురించి తెలుసుకుందాం..

ఇంటిని శుభ్రంగా ఉంచుకునే ఓపిక: స్త్రీలో అన్నిటికంటే ముఖ్యంగా శుభ్రంగా ఉండే గుణం ఉండాలి. ఆడపిల్లలు ఇంటిని శుభ్రంగా ఉంచుకునే గుణం కలిగి ఉండాలి. లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ శుభ్రమైన ఇంట్లో నివసిస్తుంది. ఇంటిని గుర్తుకు వచ్చినప్పుడు శుభ్రం చేయడానికి బదులుగా.. రోజూ అన్ని ఇతర పనుల మాదిరిగానే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమైనదిగా భావించే స్త్రీ.. ఆ ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. అంతేకాదు గరుడ పురాణంలో ఇలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ఆనందం, శాంతి, ప్రశాంతత ఎల్లప్పుడూ నివసిస్తాయని చెప్పబడింది.

  1. అతిథులను ఆదరించే గుణం: ఇంటికి అతిథులు వచ్చినప్పుడు.. వారిని చిన్న చూపు చూడకుండా.. గౌరవంగా చూడాలి. అతిధి దేవో భావం అంటూ ఆతిధ్యాన్ని ఇచ్చే గుణం స్త్రీకి ఉండాలి. ఇటువంటి లక్షణాలున్న స్త్రీని ప్రతిచోటా గౌరవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇంటి గౌరవాన్ని కాపాడే, పెద్దల గౌరవం దెబ్బతినకుండా చూసుకునే స్త్రీ ప్రతి ఇంటికి ఒక వరం. అలాగే గరుడ పురాణాల ప్రకారం ఈ లక్షణం స్త్రీకు శుభప్రదం.
  2. ఎవరినీ బాధపెట్టని గుణం: ఎవరికీ హాని జరగకూడదని కోరుకోవడం ఉత్తమ లక్షణాలలో ఒకటి. అలాంటి స్త్రీ సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రేమ, గౌరవాన్ని పొందుతుంది. ఇతరులను బాధపెట్టకూడదని నిజాయితీగా అనుకునేవారికి ఎప్పటికీ హాని జరగదని పురాణాలు చెబుతున్నాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. నమ్మదగినదిగా వ్యక్త్వితం: అందరూ నమ్మే విధంగా ఉండటం స్త్రీకి ఉండే గొప్ప లక్షణం. తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎవరికీ అయినా అబద్ధం చెప్పని గుణం ఉన్న స్త్రీకి సమాజంలో ప్రేమ, గౌరవం లభిస్తుంది. జీవితంలో ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం చెప్పడం ఎప్పుడూ మంచిది కాదు. కనుక స్త్రీ ఎప్పుడూ అబద్దం చెప్పకుండా.. నమ్మకంగా ఉండాలని పురాణం చెబుతుంది.
  5. సంతృప్తి ఉన్న స్త్రీ: తనకు ఉన్న దానితో తృప్తి పడే గుణం ఉన్న స్త్రీలో ఇంట్లో ఆనందం, శాంతి, సంతృప్తి ఉంటాయి. అంతే కాదు ఆమె భవిష్యత్ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
  6. అయితే అమ్మాయిలు ఇలాగే ఉండాలని మేము చెప్పడం లేదు.. అయితే ఇటువంటి లక్షణాలు అమ్మాయిలకు సమాజంలో గౌరవం, ప్రేమ లభిస్తుంది. అయితే గరుడ పురాణంలో పేర్కొన్న సూత్రాలను మనం అవలంబిస్తే జీవితం మరింత అందంగా మారుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు