Summer Skin Care Tips: వేసవిలో చర్మ సమస్యలా.. ఉపశమనం కోసం నిమ్మరసం ట్రై చేయండి.. ఎలా యూజ్ చేయాలంటే..
నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, సిట్రస్ యాసిడ్ వంటి అనేక పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా నిమ్మకాయ చర్మంపై మచ్చలు, సన్ టాన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. అయితే నిమ్మకాయను సరైన పద్దతిలో ఉపయోగించాలి. ఈ రోజు అందానికి నిమ్మలని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. వేసవిలో నిమ్మ రసం తో చేసిన నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఎలక్ట్రోలైట్‌లను తగ్గించదు. అయితే నిమ్మకాయను ఆహారంలోనే కాకుండా చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి, ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నిమ్మకాయలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి తాజాదనం, ఆర్ద్రీకరణను అందిస్తుంది, ముఖాన్ని మృదువుగా, ఆరోగ్యంగా చేస్తుంది. నిమ్మకాయను సరిగ్గా ఉపయోగించడం ద్వారా అనేక చర్మ సమస్యలను పరిష్కరించవచ్చు. చర్మ సమస్యలను నిమ్మకాయ ఎలా నయం చేస్తుందో..దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
మచ్చలు,పిగ్మెంటేషన్: నిమ్మకాయలో లభించే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మంపై పిగ్మెంటేషన్, మచ్చలు లేదా సన్ టానింగ్ సమస్యలు ఉంటే నిమ్మరసం వాటిపై పని చేస్తుంది. నిమ్మరసం తేలికపాటి బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
మొటిమల నివారణ కోసం: నిమ్మకాయలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను, మచ్చలను నివారించడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని మలినాలు, అదనపు నూనెల నుంచి శుభ్రపరుస్తుంది, తద్వారా మొటిమల సమస్యను తగ్గిస్తుంది.
చర్మపు రంగును సమం చేస్తుంది: నిమ్మకాయ చర్మపు రంగును మెరుగుపరచడానికి కూడా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. నిమ్మకాయను క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మానికి తాజాదనం వస్తుంది.
చర్మాన్ని బిగుతుగా- యవ్వనంగా ఉంచుతుంది: నిమ్మకాయలో యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మం వృద్ధాప్య చాయలను తగ్గిస్తాయి. అంతేకాదు చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడతాయి. తద్వారా ముడతలు, ఫైన్ లైన్ల సమస్యను తగ్గిస్తుంది.
ఎలా ఉపయోగించాలంటే: నిమ్మరసాన్ని తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనికి తేనె లేదా రోజ్ వాటర్ జోడించండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయండి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. అయితే నిమ్మరసం ఒక్కటే నేరుగా చర్మంపై పూయకూడదని గుర్తుంచుకోండి.
చర్మం చాలా సున్నితంగా ఉంటే.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఈ జాగ్రత్తలన్నిటిని తీసుకుంటూ చర్మ సంరక్షణ కోసం రోజూ ఉపయోగించే చిట్కాల్లో నిమ్మకాయను చేర్చుకోవడం ద్వారా అనేక చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)