Unique Prasad: ఈ శక్తి పీఠంలో అమ్మవారికి సమర్పించే ప్రసాదం వెరీ వెరీ స్పెషల్..
భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి. కొన్ని స్వయంభువుగా వెలసినవి అయితే మరికొన్ని మానవ నిర్మితాలు. ఇక్కడ దేవుళ్ళకు పూజలు, వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే దేవుడికి పూజ చేసిన అనంతరం పండ్లు, పాలు లేదా స్వీట్ల వంటి వాటిని ప్రసాదంగా సమర్పిస్తారు. ఒక దేవాలయంలో మాత్రం నైవేద్యం వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మవారికి.. చిప్స్, బిస్కెట్లు, నమ్కీన్ వంటి వాటిని నైవేద్యంగా పెడతారు. ఈ ఆలయం పేరు ఏమిటి? ఈ ప్రత్యేకమైన సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం.

భారతదేశం దేవాలయాల దేశం. ఇక్కడ అనేక పురాతన, చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. అయితే ఒకొక్క దేవాలయానికి సంబంధించి ఒకొక్క విశ్వాసం ఉంది. అవును దేవాలయాలలో విశ్వాసం, సంప్రదాయాలలో తేడాలు కనిపిస్తుంది. దేవాలయాలలో, దేవునికి ప్రసాదంగా పాలు, పంచామృతం పండ్లు, పులిహోర, స్వీట్లు సమర్పిస్తారు. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాలలో మాత్రం అమ్మవారికి నైవేద్యం సమర్పించే విషయంలో భిన్నమైన పద్దతిని అవలంబిస్తారు. అక్కడ భక్తులు ఆలయంలో ప్రసాదంగా అందించే బదులు, చిప్స్, బిస్కెట్లు లేదా మిక్చర్ వంటి చిరుతిళ్లను నైవేద్యంగా అందిస్తారు. అలాంటి ఒక ఆలయం అస్సాంలోని గౌహతి జిల్లాలో ఉంది. ఈ ఆలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..
కామాఖ్య దేవికి నైవేద్యంగా చిరుతిళ్లు:
ఆ ఆలయం పేరు కామాఖ్య దేవి ఆలయం. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. కామాఖ్య దేవి ఆలయంలో ప్రసాదంగా చిప్స్, బిస్కెట్లు, నమ్కీన్ నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉంది. అయితే ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైందనే దాని గురించి నిర్దిష్ట సమాచారం లేదు.
భక్తుల భక్తికి ప్రతీక:
వాస్తవానికి ప్రాంతీయ సంస్కృతి ప్రభావం భారతదేశంలోని దేవాలయాల సంప్రదాయాలలో ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. అమ్మవారికి ప్రసాదంగా చిరుతిళ్లు సమర్పించడం భక్తుల భక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తమదైన రీతిలో ప్రసాదం అందిస్తారు. కామాఖ్య దేవి ఆలయం చారిత్రాత్మకమైనది. అంతేకాదు దీనికి గొప్ప మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక్కడ భక్తులు అమ్మవారికి ఫలహారాలు సమర్పించడం వలన భక్తి మార్గం లోని అన్ని బంధనాల నుంచి విముక్తి పొందుతారని సూచిస్తుంది.
ఆలయ చరిత్ర
కామాఖ్య దేవి ఆలయం పురాతన, అద్భుతమైన చరిత్రతో నిండి ఉన్నాయి. ఈ ఆలయం నీలాచల్ కొండపై ఉంది. ఈ ఆలయం 8వ– 9వ శతాబ్దాల మధ్య నిర్మించబడిందని చెబుతారు. అయితే ఈ ఆలయం కూడా ముస్లిం దండయాత్రలలో నాశనం అయింది. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో అహోం రాజు నర నారాయణ పునర్నిర్మించాడు. కామాఖ్య దేవి ఆలయం తాంత్రిక పూజ , ధ్యానానికి ప్రధాన కేంద్రం. దేశం నలుమూలల నుంచి తాంత్రికులు పూజ , ధ్యానం కోసం ఈ ఆలయానికి వస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంబుబాచి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ జాతర దేవత రుతుక్రమాన్ని తెలియజెస్తూ నిర్వహిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు