Solar Eclipse 2025: రేపే సూర్యగ్రహణం.. మన దేశంలో దాని ప్రభావం ఏమిటి?
ఈ సంవత్సరం పాల్గుణ మాసం అమావాస్య మార్చి 29వ తేదీన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో 2025 మార్చి 29న సంభవించే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ రోజున తెలుసుకుందాం..

ఈ సంవత్సరం హోలీ సందర్భంగా అంటే మార్చి 14న సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం సంభవించింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో రెండవ గ్రహణం సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ 2025న సంభవిస్తుంది. ఈసారి మార్చి 29న చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్నదని మాత్రమే కాదు.. ఈ రోజున ఒకేసారి అనేక శుభ యోగాలు ఏర్పడతాయి కనుక.
జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 29న పాల్గుణ అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణంతో పాటు శని సంచారము కూడా జరగనున్నాయి. జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. మార్చి 29న సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. దీని వలన ఈ గ్రహణం ప్రభావం మరింత ముఖ్యమైనదిగా మారింది జ్యోతిష్కులు చెబుతున్నారు.
భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా?
జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు.. సూర్యుడికి, భూమికి మధ్య వచ్చినప్పుడు.. చంద్రుని వెనుక ఉన్న సూర్యుని నీడ కొంత సమయం వరకు పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంతేకాదు ఈ గ్రహణం భారత దేశ కాల మానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది. కనుక భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఈ గ్రహానికి మన దేశంలో మతపరమైన ప్రభావం ఉండదు. సూతక కాలం కూడా చెల్లదు. అటువంటి పరిస్థితిలో ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపదు.
భారతదేశంలో సూర్య గ్రహణం 2025 సమయం
భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:17 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మీన రాశి, ఉత్తర భాద్రపద నక్షత్రాలలో సంభవిస్తుంది. అందువల్ల ఈ గ్రహణానికి జ్యోతిష ప్రాముఖ్యత ఎక్కువగా పరిగణించబడుతుంది.
ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ సూర్యగ్రహణం బెర్ముడా, బార్బడోస్, డెన్మార్క్, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, మొరాకో, గ్రీన్లాండ్, కెనడా తూర్పు భాగం, లిథువేనియా, హాలండ్, పోర్చుగల్, ఉత్తర రష్యా, స్పెయిన్, సురినామ్, స్వీడన్, పోలాండ్, పోర్చుగల్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికాలోని తూర్పు ప్రాంతంలో కనిపిస్తుంది.
సూర్యగ్రహణం.. శని సంచారము
మార్చి 29, 2025న సూర్యగ్రహణంతో పాటు మరో ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. అదే శని సంచారము. ప్రస్తుతం శని కుంభ రాశిలో ఉన్నాడు. మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక ప్రత్యేక యాదృచ్చికం కానుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు