AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరో..

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారని.. దానిని సల్మాన్ ఖాన్ తప్పకుండా చూడాలి.. లేదంటే చూసేలా చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటే గోల్డీ భాయ్ తో ముఖాముఖి మాట్లాడాలని మెయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Salman Khan: సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరో..
Salman Khan
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2023 | 4:46 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. సల్మాన్ ఫిర్యాదుతో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, మరో వ్యక్తి రోహిత్ గార్గ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరుతో ఓ మెయిల్ వచ్చింది. హిందీలో ఉన్న ఆ మెయిల్ లో.. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ తప్పకుండా చూడాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించినట్లుగా తెలుస్తోంది.

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారని.. దానిని సల్మాన్ ఖాన్ తప్పకుండా చూడాలి.. లేదంటే చూసేలా చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటే గోల్డీ భాయ్ తో ముఖాముఖి మాట్లాడాలని మెయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయ్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ ను అంతం చేయడమేనని చెప్పడం సంచలనంగా మారింది. సల్మాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ముంబై పోలీసులు. సల్మాన్ సన్నిహితుడు ప్రమోద్ గుంజాల్కర్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సెక్షన్ 506(2), 120(బీ), 34 కేసు నమోదు చేశారు.

గతంలోనూ సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆయనకు భద్రత కూడా పెంచారు పోలీసులు. కృష్ణ జింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ ను హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్