అదంటేనే భయమేస్తోంది.. ప్లీజ్ వాటినెవరూ టచ్ చేయోద్దంటోన్న గ్లోబల్ స్టార్!

Venkata Chari

Venkata Chari |

Updated on: Jul 21, 2021 | 8:02 AM

సినిమాల్లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. చాలా బయోపిక్‌లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరికొన్ని తెరకెక్కనున్నాయి. అయితే తాజాగా ప్రియాంక చోప్రా.. తన బయోపిక్‌ను మాత్రం తీయోద్దని కోరుతోంది.

అదంటేనే భయమేస్తోంది.. ప్లీజ్ వాటినెవరూ టచ్ చేయోద్దంటోన్న గ్లోబల్ స్టార్!
Priyanka Chopra Biopic

Priyanka Chopra: సినిమాల్లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. చాలా బయోపిక్‌లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరికొన్ని తెరకెక్కనున్నాయి. అయితే తాజాగా ప్రియాంక చోప్రా.. తన బయోపిక్‌ను మాత్రం తీయోద్దని కోరుతోంది. వేరొకరి బయోపిక్‌లో మాత్రం నటిస్తానని, కానీ, తన బయోపిక్ మాత్రం అస్సలు తీయోద్దంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా గతంలో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓషో వ్యక్తిగత కార్యదర్శి మా ఆనంద్ షీలా బయోపిక్‌లో ఆమె నటిస్తోంది. ప్రియాంక చోప్రా జీవితంలో ఎన్నో ట్విస్టులున్నాయి. మొదట్లో నిర్మాతలు ప్రియాంకను వేధించడం మొదలు గ్లోబల్ స్టార్‌గా మారి, నిక్‌ను వివాహమాడి అందరికీ షాకిచ్చింది. ఇలా తన జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. అందుకే ప్రియాంక చోప్రా బయోపిక్‌ కూడా రానున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

మిస్ వరల్డ్ అయిన తరువాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా.. తన దైన ముద్ర వేసిందనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసి పేరు పొందింది. చాలా మంది నటులకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం హాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించింది. హాలీవుడ్‌లో ఇలాంటి స్థాయి పొందిన ఏకైక భారతీయ నటి ప్రియాంకానే కావడం విశేషం. అయితే, తన బయోపిక్‌ తీసే సమయం ఇంకా రాలేదని, ప్రస్తుతం అలాంటి అవసరం లేదని గ్లోబల్ స్టార్ పేర్కింది. అలాగే తన భర్తకు సంబంధించి అనేక విషయాలను ప్రియాంక వెల్లడించింది. ప్రియాంక ప్రస్తుతం మ్యాట్రిక్స్ 4తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ సిటాడెల్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ప్రియాంక.. సిటాడెల్ షూటింగ్‌లో బిజీగా ఉంది. దీనిని రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ది మ్యాట్రిక్స్ 4, టెక్స్ట్ ఫర్ యు, మిండీ కాలింగ్ సహా ఒక రోమ్-కామ్ లోనూ నటిస్తోంది.

వీటితో పాటు తన భర్త నిక్‌తో కలిసి ఓ రియాలిటీ షో చేసేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఓ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి వరుసగా వెబ్ సిరీస్‌లు చేసేందుకు భారీ ఒప్పందాలు చేసుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్‌లు పలు భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానున్నాయి.నిన్న(మంగళవారం) ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట కొన్ని ఫొటోలు పంచుకున్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజు ప్రియాంక చోప్రాకు నిక్‌ ప్రపోజ్ చేశాడని, ఆనాటి ఓ ఫొటోను ఇన్‌స్టాలో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించింది.

Also Read:

Krithi Shetty : ఉప్పెనంత క్రేజ్ తెచ్చుకున్న అందాల కృతి .. ఆ హీరో సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసిందట..

Rakul Preet Singh: హాటెస్ట్ ఫిట్నెస్ ఫ్రీక్… జిమ్ లో చమట్లు చిందిస్తోన్న అందాల రకుల్.. వీడియో వైరల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu