Krithi Shetty : ఉప్పెనంత క్రేజ్ తెచ్చుకున్న అందాల కృతి .. ఆ హీరో సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసిందట..

ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ మనసులో చెరగని ముద్ర వేసింది బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో...

Krithi Shetty : ఉప్పెనంత క్రేజ్ తెచ్చుకున్న అందాల కృతి .. ఆ హీరో సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసిందట..
Krithi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 21, 2021 | 7:48 AM

Krithi Shetty : ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ మనసులో చెరగని ముద్ర వేసింది మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు.. వసూళ్లను కూడా భారీగానే రాబట్టింది. ఈ సినిమా తర్వాత కృతికు  తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది. అలాగే యంగ్ హీరో సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలోనూ ఈ కుర్రది ఎంపికైందని తెలుస్తుంది. ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని- లింగు స్వామి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది కృతి శెట్టి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకుందని తెలుస్తోంది.

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కనున్న బంగార్రాజు సినిమాలో కృతికి ఛాన్స్ వచ్చిందని టాక్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. చైతూకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేశారట. ఈ సినిమాకి గాను ఈ చిన్నది తన రెమ్యునరేషన్ పెంచిందని తెలుస్తోంది. నిన్నటి వరకు 50 లక్షల వరకు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ సినిమాకోసం 75 లక్షలు ఛార్జ్ చేస్తోందట. ఉప్పెనంత క్రేజ్ తెచ్చుకున్న కృతి ఆ మాత్రం రెమ్యునరేషన్ పెంచడంలో తప్పేలేదంటున్నారు ఈ అమ్మడి అభిమానులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్..! ఫేస్‌బుక్‌‌లో కోటి మంది ఫాలోవర్స్..

Mehreen: అనుకోకుండా మంచి రోజులు వచ్చాయంటోన్న మెహ్రీన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సెడన్‌గా ప్రకటన..

‎Aha : అదిరిపోయే కంటెంట్‌‌‌‌తో దూసుకుపోతోన్న ఆహా.. త్వరలో మరో ఆసక్తికర సినిమాతో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!