Anupam Kher: 40 ఏళ్ల సినీ ప్రస్థానం.. గురువు నుంచి అందిన ప్రశంసలు
దాదాపు 40 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు అనుపమ్ ఖేర్. తన కెరీర్ లో అనేక రకాల పాత్రలను పోషించారు ఈ టాలెంటెడ్ నటుడు. ఇక ఇప్పుడు ఈ వర్సటైల్ యాక్టర్ కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విజయ్ 69. విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ ఖేర్ తన కెరీర్ లో 500 కంటే ఎక్కువ సినిమాలు చేశారు. దాదాపు 40 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు అనుపమ్ ఖేర్. తన కెరీర్ లో అనేక రకాల పాత్రలను పోషించారు ఈ టాలెంటెడ్ నటుడు. ఇక ఇప్పుడు ఈ వర్సటైల్ యాక్టర్ కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన విజయ్ 69 చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ వృద్ధాప్యంలో యువతతో కలిసి విన్యాసాలు చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
నెట్‌ఫ్లిక్స్ లో అనుపమ్ ఖేర్ చిత్రం విజయ్ 69 సినిమా విడుదల చేసింది. ఈ చిత్రంలో విజయ్ అనే 69 ఏళ్ల వృద్ధుడి పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు. ఈ సినిమా పై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూడా అనుపమ్ ఖేర్ పై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుపమ్ ఖేర్‌కి మహేష్ భట్ శుభాకాంక్షలు తెలిపారు. అనుపమ్ ఖేర్ తొలి సినిమా సారాంశ్ కు మహేష్ భట్ దర్శకత్వం వహించారు. కాగా అనుపమ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని మహేష్ భట్ అన్నారు. దానికి రిప్లే ఇస్తూ భట్ సాబ్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అనుపమ ఖేర్ అన్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఓ ఫోటోను షేర్ చేస్తూ..” మీరు నా భావోద్వేగాలను చూడలేరు, భట్ సాబ్ నుంచి ప్రేమ, దయ నన్ను పూర్తిగా ముంచెత్తింది. అలాగే చాలా జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. తనకు నటుడిగా గుర్తింపు తెచ్చేది మహేష్ భట్ అని ఖేర్ వెల్లడించారు. నాపై నాకు నమ్మకం కలిగించినందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.. థాంక్యూ భట్ సాబ్ అని రాసుకొచ్చారు అనుపమ్.
ఇక విజయ్ 69 సినిమా విషయానికొస్తే.. జీవితంలో తనను తాను అన్వేషించాలనుకునే 69 ఏళ్ల వ్యక్తి పాత్రను పోషించారు. ఇందుకోసం సినిమాలో ఆయన చాలా సన్నాహాలు చేస్తాడు. అయితే అందుకు అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. అయితే 69 ఏళ్ల వయసులో, విజయ్ 1.5 కిలోమీటర్లు ఈత కొట్టి, కొన్ని కిలోమీటర్లు పరుగెత్తి, ఆపై 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కాల్సిన ట్రయాథ్లాన్ పోటీలో ఎలా పాల్గొంటాడు అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు అనుపమ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.