AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay 69 OTT: 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ కల సాకారం.. ఓటీటీలో ఈ సినిమాను మిస్ కావొద్దు… తెలుగులోనూ చూడొచ్చు

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల తెలుగు సినిమాల్లోనూ తరచూ కనిపిస్తున్నాడీ సీనియర్ యాక్టర్. ఆ మధ్యన రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నిఖిల్ కార్తికేయ2 సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు అనుపమ్ ఖేర్.

Vijay 69 OTT: 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ కల సాకారం.. ఓటీటీలో ఈ సినిమాను మిస్ కావొద్దు... తెలుగులోనూ చూడొచ్చు
Vijay 69 Movie
Basha Shek
|

Updated on: Nov 09, 2024 | 1:52 PM

Share

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విజయ్ 69. టైటిల్ కు తగ్గట్టుగానే 69 ఏళ్ల వయసులో తన కలను సాకారం చేసుకునే ఒక వ్యక్తి కథ ఇది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా అందరూ నిరాశపర్చినా 69 ఏళ్ల వయసులో తన ట్రయథ్లాన్ కలను ఎలా సాకారం చేసుకున్నాడన్నదే విజయ్ 69 మూవీ కథ. దర్శకుడు అక్షయ్ రాయ్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో అనుపమ్ ఖేర్‌తో పాటు చుంకీ పాండే, మిహిర్ అహుజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మనీష్ శర్మ నిర్మించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పిస్తారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న విజయ్ 69 సినిమా శుక్రవారం (నవంబర్ 08) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. విజయ్ 69 సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయని ట్రైలర్ తోనే అర్థమైంది.

విజయ్ 69 సినిమా కథ విషయానికి వస్తే.. 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ లో పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకుంటాడు యాంగ్రీ ఓల్డ్ మ్యాన్. ఈ ట్రయథ్లాన్ లో భాగంగా 1.5 కి.మీ. స్విమ్మింగ్, 40 కి.మీ. సైక్లింగ్, 10 కి.మీ. రన్నింగ్ పూర్తి చేస్తానని తన ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఛాలెంజ్ విసురుతాడు. అతని మాటలు విని అందరూ నవ్వుతారు తప్ప ఎవరూ ఎంకరేజ్ చేయరు. చివరికి ట్రయథ్లాన్ నిర్వాహకులు కూడా అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. మరి తన కలను ఎలా సాకారం చేసుకున్నాడో తెలుసుకోవాలంటే విజయ్ 69 సినిమా చూడాల్సిందే.

69 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్న అనుపమ్ ఖేర్..

అనుపమ్ ఖేర్ వయసు ఇప్పుడు 69 ఏళ్లు. ఈ వయసులో కొత్తవి నేర్చుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. ఉన్న జ్ఞానం సరిపోతుందని తృప్తి పడుతుంటారు. అయితే అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నం. 68 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నారు! అవును ఇది ఆశ్చర్యంగా ఉన్న నిజం. . దీనికి కారణం ‘విజయ్ 69’ సినిమా. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘రాబోయే సంవత్సరాల్లో నేను కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. నాకు ఈత రాదు. కానీ, అందుకోసం చాలా కష్టపడ్డాను. కొత్తది నేర్చుకోవడానికి ఇది మిమ్మల్ని కూడా ప్రేరేపించవచ్చు. ఇన్నాళ్లూ మీరు అందించిన ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అని అనుపమ్ ఖేర్ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం నేను కొత్తగా ఏదైనా చేయాలనే ఛాలెంజ్‌ని స్వీకరించాను. సంవత్సరాల క్రితం నేను ఒక వర్కవుట్ ఫోటోను పోస్ట్ చేసాను. ఇలాంటి ఫోటో పోస్ట్ చేయడానికి ధైర్యం కావాలి. ఇప్పుడు స్విమ్మింగ్ ఛాలెంజ్ తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

విజయ్ 69 సినిమా ట్రైలర్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.