దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. నాయకుడు సినిమాతో చరిత్ర సృష్టించిన ఈ కాంబో ఆ తరువాత మళ్లీ రిపీట్ కాలేదు. విక్రమ్ సక్సెస్‌తో మూవీ సెలక్షన్ స్టైల్ మార్చిన కమల్, క్లాసిక్ కాంబోను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా లైన్‌లోకి వచ్చింది థగ్ లైఫ్.