AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar: అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం.. యాక్షన్ సీన్ షూటింగ్‌లో గాయపడిన అక్కీ

అక్షయ్ కుమార్ గాయపడటంతో కొంత సమయం షూటింగ్ ఆగిపోయింది. అయితే అక్షయ్ తన క్లోజప్‌తో మిగిలిన భాగాన్ని షూట్ చేసినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ చాలా ధృడమైన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే..

Akshay Kumar: అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం.. యాక్షన్ సీన్ షూటింగ్‌లో గాయపడిన అక్కీ
Akshay Kumar Injured
Surya Kala
|

Updated on: Mar 24, 2023 | 7:42 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో.. అక్షయ్ కుమార్‌ కు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ సినిమాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలను ఎటువంటి డూప్ సహాయం తీసుకోకుండా స్వయంగా చేస్తారు. అక్షయ్ వెండి తెరపై అడుగు పెట్టినప్పటి నుంచి ఎటువంటి రిస్క్ సన్నివేశమైనా స్వయంగా చేయడం అలవాటు.  ఎటువంటి డూప్ సహాయం తీసుకోరు ఈ యాక్షన్ హీరో అక్షయ్.  అయితే ఇలా యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’ సెట్స్‌లో గాయపడ్డాడు.

అక్షయ్ కుమార్ తన సహనటుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘బడే మియాన్ చోటే మియాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్కాట్లాండ్‌లో జరుగుతోంది. సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్..  టైగర్‌తో కలిసి యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నాడు. ఓ స్టంట్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అక్షయ్ గాయపడ్డాడు. అయితే పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. గాయపడిన తర్వాత కూడా.. అక్షయ్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు.

అక్షయ్ కుమార్ గాయపడటంతో కొంత సమయం షూటింగ్ ఆగిపోయింది. అయితే అక్షయ్ తన క్లోజప్‌తో మిగిలిన భాగాన్ని షూట్ చేసినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ చాలా ధృడమైన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.. తన వలన మిగిలినవారు ఇబ్బంది పడకూడదని.. షూటింగ్ సమయం వృథా కాకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం.. షెడ్యూల్ ప్రకారం మరిన్ని సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్ . పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ఈ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అక్షయ్‌  టైగర్ లతో పాటు, ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా ,పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. వీరు స్కాట్లాండ్‌కు వెళ్లే ముందు ముంబైలో తమ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. మార్చి ప్రారంభంలో, చిత్ర దర్శకుడు అలీ ఈ చిత్రం సెట్స్ నుండి సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేసి షూటింగ్ వివరాలను అందరితో పంచుకున్నారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. .