AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonam Kapoor: బాలీవుడ్ వివాహ బంధాలపై సోనమ్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. అందుకే ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోలేదంటూ..

బాలీవుడ్ వివాహా బంధాలపై హీరోయిన్ సోనమ్ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని కాకుండా.. మరో వ్యక్తిని చేసుకున్నానని..

Sonam Kapoor: బాలీవుడ్ వివాహ బంధాలపై సోనమ్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. అందుకే ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోలేదంటూ..
Sonam Kapoor
Rajitha Chanti
|

Updated on: Jul 07, 2021 | 6:56 AM

Share

బాలీవుడ్ వివాహ బంధాలపై హీరోయిన్ సోనమ్ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని కాకుండా.. మరో వ్యక్తిని చేసుకున్నానని.. తన జీవితం ఇప్పుడు ఎంతో సంతోషంగా సాగిపోతుందని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు కొన్ని సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అందులో హృతిక్ రోషన్, సుజాన్ ఖాన్, ఆర్బాజ్ ఖాన్, మలైకా ఆరోరా, సైఫ్ అలీకాన్, అమృతా సింగ్ వంటి జంటలు విడాకులు తీసుకోగా.. తాజాగా అమీర్ దంపతులు సైతం విడాకుల ప్రకటన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ… బాలీవుడ్ వివాహ బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“దేవుడి దయవలన నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకోలేదు. అందుకు దేవుడికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే.. ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్ లో జరుగుతుంది కూడా ఇదే. నాలాగా ఆలోచించే.. ఫెమినిస్ట్ ను పెళ్లాడటం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి ” అంటూ చెప్పుకొచ్చారు సోనమ్ కపూర్. అలాగే తన వివాహం జీవితం గురించి మాట్లాడుతూ.. ” పెళ్లి తర్వాత మేము ప్రతి రోజు కలిసి ఉంటున్నాము. ఎందుకంటే ముంబై-ఢిల్లీ-లండన్‏ల మధ్య ప్రయాణాలకే సమయం సరిపోయేది. మాకు ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమ ఉంది. ఇద్దరం కలిస్తే సంతోషానికి హద్దు లేదు. లండన్‏లో ఒంటరిగా ప్రయాణించడం వలన చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఇక్కడ భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయుల మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ఎంతో మంది ప్రజలను చూశాను. వాళ్లందరికి బాలీవుడ్ అంటే ఒకరకమైన పిచ్చి ఉంటుందని అర్థమైంది” అని సోనం అన్నారు. 2018లో సోనం కపూర్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది.

Also Read: Kangana Ranaut: మరోసారి సంచలన కామెంట్స్ చేసిన కంగనా రనౌత్.. అమీర్ దంపతుల విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు..

Ranveer Singh Birthday: రణవీర్ ఫస్ట్ యాక్టింగ్ క్లాసు.. అతడు ఏం చేశాడో చూస్తే మీరూ నవ్వాపుకోలేరు.!