AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: మరోసారి సంచలన కామెంట్స్ చేసిన కంగనా రనౌత్.. అమీర్ దంపతుల విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు..

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన రెండవ భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లుగా ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది.

Kangana Ranaut: మరోసారి సంచలన కామెంట్స్ చేసిన కంగనా రనౌత్.. అమీర్ దంపతుల విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు..
Kangana
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2021 | 12:52 PM

Share

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన రెండవ భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లుగా ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. 15 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట ఆకస్మాత్తుగా విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో అమీర్ ఖాన్ అభిమానులు షాకయ్యారు. దీంతో అమీర్ ఖాన్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. వీరి వైవాహిక జీవితంలోకి మరో నటి రావడం వలనే అమీర్ తన భార్యకు విడాకులు ఇస్తున్నాడంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అమీర్, కిరణ్ రావు.. తాము ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నామని… అయినా కానీ తాము ఒక్కటే అని… ఒకరికి ఒకరు కలిసి ఉంటామని చెబుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా వీరి విడాకుల విషయంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించారు.

Amir

Amir

కంగనా తన ఇన్‏స్టాగ్రామ్ వేదికగా అమీర్, కిరణ్ రావు విడాకులపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. “పంజాబ్‏లోని చాలా కుటుంబాలు ఒక సమయంలో ఒక కొడుకును హిందువుగా.. మరొక కొడుకును సిక్కుగా పెంచేవాళ్లు. అయితే ఈ ఆచారాన్ని హిందువులు, ముస్లింలు, సిక్కులు ఎవరు అంతగా చూడలేదు. కానీ అమీర్ ఖాన్ సర్ రెండవసారి విడాకులు తీసుకున్నప్పటికీ.. పిల్లలు మాత్రం ఎందుకు ముస్లీంగా గుర్తించబడతారనేది ఒక ఇంటర్ ఫెయిత్ వివాహంలో చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. స్త్రీ ఎందుకు హిందువుగా కొనసాగకూడదు. మారుతున్న కాలంతోపాటే మనం కూడా దీనిని మార్చాలి. ప్రస్తుతం అవలంభిస్తున్న పద్దతి చాలా పురాతనమైనది. ఒక కుటుంబంలో హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, రాధస్వామి, నాస్తికులు జీవించినట్లే.. ముస్లింలు కూడా ఎందుకు జీవించరు. ముస్లింలను వివాహం చేసుకోవడానికి మరోకరు ఎందుకు మతం మార్చుకోవాలి ? ” అంటూ ప్రశ్నించారు కంగనా.

అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ వారిద్దరు ఆజాద్‏కు తల్లిదండ్రులుగానే వ్యవహిస్తామని చెప్పారు అమీర్ దంపతులు.

Also Read: నవమన్మథుడి నయా లుక్.. మేకప్ లేకుండా నాగ్ ఇలా ఉంటారా.. గుర్తుపట్టడం కష్టమే..

Salaar Movie: ‘సలార్’ లో మరో బ్యూటీ… ప్రభాస్ కోసం రంగంలోకి మరో బాలీవుడ్ హీరోయిన్… ఇంతకీ రోల్ ఎంటో ?