Salaar Movie: ‘సలార్’ లో మరో బ్యూటీ… ప్రభాస్ కోసం రంగంలోకి మరో బాలీవుడ్ హీరోయిన్… ఇంతకీ రోల్ ఎంటో ?

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 06, 2021 | 8:05 AM

"సాహో" తర్వాత ప్రభాస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు డార్లింగ్ చేతిలో ఏకంగా నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Salaar Movie: 'సలార్' లో మరో బ్యూటీ... ప్రభాస్ కోసం రంగంలోకి మరో బాలీవుడ్ హీరోయిన్... ఇంతకీ రోల్ ఎంటో ?
Salaar

“సాహో” తర్వాత ప్రభాస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు డార్లింగ్ చేతిలో ఏకంగా నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ప్రస్తుతం మూడు షూటింగ్ జరుపుకుంటుండగా.. మరోకటి అప్‏డేట్ కూడా లేదు. అయితే ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా నటించిన “రాధేశ్యామ్” సినిమా షూటింగ్ పూర్తైందని.. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఆ మూవీ సెట్స్ పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతోపాటే.. ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” కాగా.. మరోకటి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో “సలార్”. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ సినిమాల గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. సలార్ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మరో హీరోయిన్‏ను చిత్రయూనిట్ రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే సలార్ మూవీలో ప్రభాస్ కు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలోని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఓ కీలక పాత్ర లో ఆ అమ్మడు కనిపించనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది.

Vani Kapoor

Vani Kapoor

Also Read: Oka Chinna Viramam: ‘ఆహా’లో పునర్నవి భూపాలం మూవీ ‘ఒక చిన్న విరామం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Covid-19 Fake Report: భార్య నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్.. కరోనా ఫేక్‌ రిపోర్ట్‌‌తో వేశాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu