Dilip Kumar Death: బాలీవుడ్‏లో పెను విషాదం.. లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూత..

Dilip Kumar:  బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ (98) బుధవారం (జూలై 7న) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న

Dilip Kumar Death: బాలీవుడ్‏లో పెను విషాదం.. లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూత..
Dilip Kumar
Follow us

|

Updated on: Jul 07, 2021 | 11:21 AM

Dilip Kumar:  బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ (98) బుధవారం (జూలై 7న) కన్నుమూశారు.  గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు. జూన్ 30న ఆయన ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరగా..  ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియూ)లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అనారోగ్య సమస్యలతో జూన్ నెలలో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు.  అయితే దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడిందని.. ప్రస్తుతం బాగున్నారని ఇటీవల ఆయన భార్య సైరా భాను సోషల్ మీడియా వేదికగా పేర్కోన్నారు. అయితే అంతకుముందు జూన్ 6న దిలీప్ కుమార్ ఊపిరి తీసుకోవడంలో సమస్య రావడంతో ఆసుపత్రిలో చేరారు. ప్లూరల్ ఎఫ్యూషన్‏తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈరోజు ఉదయం  07.30కి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో దీలిప్ కుమార్ మరణించారు. ఇక‌ దిలీప్ కుమార్ ఇద్దరు త‌మ్ముళ్లు అస్లాం ఖాన్‌, ఎహ్సాన్ ఖాన్ క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న దిలీప్ కుమార్.. ఆ తర్వాత శ్యాస సంబంధిత సమస్యలతో అనేకసార్లు ఆసుపత్రిలో చేరారు.

Dilip

Dilip

ట్వీట్..

ఆయన అసలు పేరు మహమ్మాద్ యూసూఫ్ ఖాన్. 1944లో ‘జ్వార్ భాటా’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు దిలీప్ కుమార్. 1947లో విడుదలైన జుగ్ను సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత  ‘దేవదాస్’ (1955), ‘నయా దౌర్’ (1957), ‘మొఘల్-ఎ-అజామ్’ (1960), ‘గంగా జమునా’ వంటి హిట్ సినిమాల్లో నటించారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998లో ‘కిలా’ సినిమాలో కనిపించారు. 1944 నుంచి 1998 వరకు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు దిలీప్‌కుమార్. 1991లో కేంద్రం దిలీప్‌కుమార్‌కి పద్మభూషన్‌ అవార్డుతో సత్కరించింది. 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2000-2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు ఈ బాలీవుడ్‌ నటుడు. ఉత్తమ నటుడిగా 8 సార్లు ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు అందుకున్నారు దిలీప్‌కుమార్.1955లో వచ్చిన దేవదాస్ సినిమా దిలీప్‌కుమార్‌కి ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ‘మొఘల్ ఏ అజామ్‌’ అనే పౌరాషిక సినిమాతో మోస్ట్ పాపులర్ అయ్యారు దిలీప్‌కుమార్. స్నేహితుడు రాజ్‌కపూర్‌తో కలిసి దాదాపు 65 సినిమాల్లో యాక్ట్ చేశారు దిలీప్‌కుమార్. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్‌కుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్‏ను చూపించారు.

Also Read:  Pushpa Movie Update : అల్లు అర్జున్ ‘ పుష్ప’ షూటింగ్ ప్రారంభం.. ఈ ఏడాది చివరలో విడుదల చేయడానికి ప్రయత్నాలు..

Marriage: మాకేనా కరోనా నిబంధనలు.. వైన్ షాపు ఎదుట ఒక్కటైన నూతన జంట.. అసలేమైందంటే..?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.