AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage: మాకేనా కరోనా నిబంధనలు.. వైన్ షాపు ఎదుట ఒక్కటైన నూతన జంట.. అసలేమైందంటే..?

Couple Married Outside Liquor Shop: జీవితంలో ఎవరైనా వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటారు. దానికోసం పెద్ద మొత్తంలో ఖర్చుచేస్తారు. అయితే.. సాధారణంగా పెళ్లి వేడుకను కళ్యాణ మండపంలో గానీ..

Marriage: మాకేనా కరోనా నిబంధనలు.. వైన్ షాపు ఎదుట ఒక్కటైన నూతన జంట.. అసలేమైందంటే..?
Couple Married Outside Liquor Shop
Shaik Madar Saheb
|

Updated on: Jul 07, 2021 | 8:22 AM

Share

Couple Married Outside Liquor Shop: జీవితంలో ఎవరైనా వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటారు. దానికోసం పెద్ద మొత్తంలో ఖర్చుచేస్తారు. అయితే.. సాధారణంగా పెళ్లి వేడుకను కళ్యాణ మండపంలో గానీ.. ఆలయాల్లో కానీ, ఇంటి దగ్గర కానీ నిర్వహించుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ జంట మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించింది. తమ వివాహ వేడుకను వైన్‌షాపు ఎదుట చేసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ సంఘటన కేరళలోని కోజికోడ్‌ పట్టణంలో చోటుచేసుకుంది. కోజికోడ్‌కు చెందిన ప్రమోద్‌, ధన్యా బైపాస్ రోడ్డు పక్కనున్న మద్యం దుకాణం ముందు దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరు గత కొంత కాలంగా క్యాటరింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. అయితే.. అక్కడకు వచ్చిన అథిదులంతా వారిద్దరినీ ఆశీర్వదించారు. అయితే.. ప్రభుత్వంపై నిరసనలో భాగంగా కేరళ క్యాటరర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రమోద్, ధన్యా దంపతులు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి కారణంగా వివాహ వేడుకలకు 50 మందికి మాత్రమే కేరళ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో కొన్ని నెలలుగా తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రమోద్‌, ధన్యా పేర్కొన్నారు. అందుకే తాము, ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మద్యం దుకాణం ముందు పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మద్యం షాపుల దగ్గర వందలాది మంది ఎగబడుతున్నారని.. అక్కడ పాటించని కరోనా నిబంధనలు వివాహ వేడుకలకు ఎందుకని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులతో క్యాటరర్స్ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం వందమందినైనా వివాహాలకు అనుమతించాలని క్యాటరర్స్ ను ఆదుకోవాలని కోరారు.

అయితే.. ఈ వివాహానికి కోజికోడ్‌ ఎంపీ ఎంకె రాఘవన్‌, క్యాటరర్స్ అసోసియేషన్ నేతలు సైతం పాల్గొన్నారు. అయితే.. ఈ వివాహ వేడుక కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లంతా మీ ఐడియా బాగుంది అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Dilip Kumar Death: బాలీవుడ్‏లో పెను విషాదం.. లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూత..

Dhoni: హ్యాపీ బర్త్‌డే ‘మిస్టర్ కూల్’.. కెప్టెన్లకే ‘బాద్‌షా’.. భారత క్రికెట్‌లో ఓ ట్రెండ్ సెట్టర్..