Dilip Kumar Death: దిలీప్ కుమార్ మరణంపై నేతల సంతాపం.. సినిమా లెజెండ్‏గా అభివర్ణించిన ప్రధాని..

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (98) ఈరోజు ఉదయం కన్నుముశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్..

Dilip Kumar Death: దిలీప్ కుమార్ మరణంపై నేతల సంతాపం.. సినిమా లెజెండ్‏గా అభివర్ణించిన ప్రధాని..
Dilip Kumar 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 07, 2021 | 9:12 AM

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (98) ఈరోజు ఉదయం కన్నుముశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్.. జూన్ 30న ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న దిలీప్ కుమార్ ఈరోజు ఉదయం 07.30కి ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారు. దీలిప్ కుమార్ మరణా వార్తతో సినీ పరిశ్రమకు ఒక్కసారిగా షాక్‏కు గురయ్యారు. ప్రధాని నరేంద్రమోది, కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమలో దిలీప్ కుమార్ ఒక లెజెండ్‏గా గుర్తుండిపోతారని ప్రధాని నరేంద్రమోది అన్నారు. ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో దిలీప్ కుమార్ మరణ వార్తపై స్పందించారు. ఈ మేరకు.. ” అసమానమైన తేజస్సు ఉన్న దిలీప్ కుమార్.. ఆయన నటనకు తరతరాలుగా ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారని.. అలాంటి దిగ్గజ నటుడు కన్ను మూయడం కళారంగానికి తీవ్ర నష్టమని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. దిలీప్ కుమార్ కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు” నరేంద్రమోది.

ట్వీట్..

అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ సైతం దిలీప్ కుమార్ మరణ వార్త పై స్పందిస్తూ.. “దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో దిలీప్ కుమార్ నటన.. తరతరాలకు గుర్తుండిపోతుందని” ట్వీట్ చేశారు..

ట్వీట్..

రాజ్‏నాథ్ సింగ్ ట్వీట్..

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ.. “దిలీప్ కుమార్ గొప్ప నటుడు.. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఆయన ఆదర్శంగా కృషి చేశారు. గంగా జమునా వంటి సినిమాలో ఆయన నటన ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. నేను పద్మ విభూషణ్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గోనడానికి ముంబైకి వెళ్లినప్పుడు దిలీప్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలిశాను. అలాంటి దిగ్గజ నటుడితో మాట్లాడడం ఒక మధురానుభూతి. ఆయన మరణం భారతీయ సినిమాకు అపార నష్టం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు హృదయపూర్వకంగా సంతాపం తెలుపుతున్నాను” అంటూ రాజ్‏నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

ట్వీట్..

Also Read:

Pushpa Movie Update : అల్లు అర్జున్ ‘ పుష్ప’ షూటింగ్ ప్రారంభం.. ఈ ఏడాది చివరలో విడుదల చేయడానికి ప్రయత్నాలు..

Dilip Kumar Death: బాలీవుడ్‏లో పెను విషాదం.. లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూత..