AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie Update : అల్లు అర్జున్ ‘ పుష్ప’ షూటింగ్ ప్రారంభం.. ఈ ఏడాది చివరలో విడుదల చేయడానికి ప్రయత్నాలు..

Pushpa Movie Update : కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ షూటింగ్‌లు మొదలవుతున్నాయి. గత నెలలో లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాలు

Pushpa Movie Update : అల్లు అర్జున్ ' పుష్ప' షూటింగ్ ప్రారంభం.. ఈ ఏడాది చివరలో విడుదల చేయడానికి ప్రయత్నాలు..
Pushpa
uppula Raju
| Edited By: Phani CH|

Updated on: Jul 07, 2021 | 8:25 AM

Share

Pushpa Movie Update : కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ షూటింగ్‌లు మొదలవుతున్నాయి. గత నెలలో లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రీకరణ సికింద్రాబాద్‌లో షురూ అయింది. 45 రోజులపాటు ఏకధాటిగా సాగే సుదీర్ఘమైన ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో తొలి భాగం సినిమా పూర్తి కానున్నట్టు సమాచారం.

సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటిస్తోంది. ప్రతినాయకుడిగా ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బన్నీ పూర్తిగా డీగ్లామర్‏ రోల్‏లో కనిపించబోతుండడంతో.. పుష్ప కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే విడుదల చేసిన “ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్” వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికర అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీపై మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారట. స్పెషల్ సాంగ్‏లో చిరు ఇలా వచ్చి వెళ్లిపోతారని అంటున్నారు. చిరు అంటే బన్నీకి అమితమైన ప్రేమ. అలాంటిది తన సినిమాలోనే చిరు రావడం…ఒకే ఫ్రేములో ఇద్దరిని చూడడం అభిమానులకే పండగ అని చెప్పుకోవాలి.

Tuck Jagadish: రిలీజ్ కు రెడీ అవుతున్న టక్ జగదీష్.. డేట్ ఫిక్స్ చేసే పనిలో చిత్రయూనిట్

Cabinet Expansion: కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు.. యువత, విద్యావంతులకు పెద్దపీట

Bengal Legislative Assembly: మమతా బెనర్జీ కొత్త స్కెచ్.. మండలి ఏర్పాటు తీర్మానానికి శాసనసభ ఆమోదం