Samantha: బాలీవుడ్‌లో పాగా వేస్తున్న సమంత.. క్యూ కడుతోన్న వరుస ఆఫర్లు..
Samantha: సమంత పేరు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తోంది. కొన్నేళ్ల పాటు సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఈ చిన్నది వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. పుష్ప (Pushpa) చిత్రంలో ఐటెం సాంగ్‌తో ఒక్కసారిగా సంచలనం..
Samantha: సమంత పేరు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తోంది. కొన్నేళ్ల పాటు సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఈ చిన్నది వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. పుష్ప (Pushpa) చిత్రంలో ఐటెం సాంగ్‌తో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఈ చిన్నది అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ పాటతో మొదలైన సమంత సినిమాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగులో యశోద, శాకుంతలమ్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న సామ్ బీటౌన్‌లోనూ తన సత్తా చాటుతోంది.
ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్‌తో నార్త్ ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన సమంతకు ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్‌తో తనను బాలీవుడ్‌కు పరిచయం చేసిన రాజ్ డీకే మరోసారి సమంతను డైరెక్ట్ చేస్తున్నారు. వరున్ ధావన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో సమంత పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. జులై నుంచి ఈ వెబ్ సిరీస్ సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఇదిలా ఉంటే సమంతకు బాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్లు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు సమంతను అప్రోచ్ అవుతున్నారని సమాచారం. బీటౌన్ చిత్రాల కోసం తరుచూ ముంబయి వెళ్లడం ఇబ్బందిగా మారడంతో సమంత ఏకంగా ముంబయిలో ఓ ఫ్లాట్ తీసుకున్న విషయం తెలిసిందే. సమంత నటించనున్న బాలీవుడ్ ప్రాజెక్టులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయని తెలుస్తోంది.
Also Read: Viral: మొసలి-అడవిదున్న ఫైట్ ఎప్పుడైనా చూసారా..! ఒళ్లు గగుర్పొడిచే సీన్..