Viral: మొసలి-అడవిదున్న ఫైట్ ఎప్పుడైనా చూసారా..! ఒళ్లు గగుర్పొడిచే సీన్..
ప్రతిరోజూ సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వీటిలో ఓ వీడియో వచ్చి చేరింది. నదిని దాటుతున్న అడవి దున్నపై మొసలి దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
ప్రతిరోజూ సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వీటిలో ఓ వీడియో వచ్చి చేరింది. నదిని దాటుతున్న అడవి దున్నపై మొసలి దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో అడవి దున్న ధైర్యం కోల్పోకుండా మొసలితో పోరాడింది. దీనిని చూసిన నెటిజన్లంతా అడవి దున్న సాహసాన్ని తెగ మొచ్చుకుంటున్నారు. అయితే, మొసలి ఏదైనా ఎరను పట్టుకుంటే దానిని సజీవంగానే మింగేయగల శక్తి దాని సొంతం. తన బలమైన దవడలతో ఎరను పట్టుకుందంటే దానిని తినే వరకు వదలకుండా పోరాడుతుంది. అంతటి శక్తివంతమైన జంతువుకు కూడా ఒక్కోసారి ఓటమి తప్పదు.. అదే జరిగింది ఇక్కడ.సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. అడవిలోని ఓ సరస్సు దగ్గరకు నీరు తాగేందుకు ఆఫ్రికన్ రెయిన్ డీర్ వచ్చింది. అడవి దున్న సరస్సు లోపలికి దిగగానే.. లోపల ఉన్న మొసలి ఒక్కసారిగా దానిపై దాడి చేసింది. అయిపోయానురా బాబు అనుకుంది పాపం ఆ అడవిదున్న… కానీ ధైర్యం కోల్పోలేదు.. మొసలినుంచి తన ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. తనలోని శక్తినంతా కూడదీసుకొని మొసలిని నీటి నుంచి ఒడ్డు వరకూ తీసుకురాగలిగింది. ఈ క్రమంలో రైయిన్‌డీర్ తప్పించుకుంటుంది. అయినా మొసలి వదల్లేదు. అడవి దున్న తోకను గట్టిగా పట్టుకుని, దానిని తిరిగి నీటిలోకి లాగడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అయితే దాని ప్రయత్నం ఫలించలేదు.. అడవిదున్న విజయవంతంగా గట్టుపైకి చేరుకుని మొసలిబారినుంచి తన ప్రాణాలు కాపాడుకుంది. షాకింగ్ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వేలమంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షిస్తూ లైక్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)