Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: మా సినిమాలో ఇందిరా, కాంగ్రెస్‌లను అలా చూపించడం లేదు.. ‘ఎమర్జెన్సీ’ పై కంగనా క్లారిటీ

బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. టైటిల్‌కు తగ్గట్టుగానే 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్‌ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. దర్శకత్వ బాధ్యతలు కూడా ఆమె తీసుకుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 24న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

Kangana Ranaut: మా సినిమాలో ఇందిరా, కాంగ్రెస్‌లను అలా చూపించడం లేదు.. 'ఎమర్జెన్సీ' పై కంగనా క్లారిటీ
Kangana Ranaut
Follow us
Basha Shek

|

Updated on: Sep 20, 2023 | 9:18 PM

బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. టైటిల్‌కు తగ్గట్టుగానే 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్‌ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. దర్శకత్వ బాధ్యతలు కూడా ఆమె తీసుకుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 24న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేశారు మేకర్స్‌. అయితే ఎమర్జెన్సీ సినిమాపై కొందరు అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ ఇందిరా గాంధీని , కాంగ్రెస్ పార్టీకి కించపరుస్తూ ఎమర్జెన్సీ సినిమాను చిత్రీకరించారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు గత కొంతకాలంగా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా కామెంట్లు చేస్తోంది కంగన. పలు సందర్భాల్లో ప్రధాన మంత్రి మోడీని ప్రశంసిస్తూ స్టేట్‌మెంట్లు ఇచ్చిందామె. దీంతో ‘ఎమర్జెన్సీ’ సినిమాలోఆమె ఇందిరాగాంధీని, కాంగ్రెస్ పార్టీని ఎలా చూపిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అలాగే ఈ సినిమా కూడా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటుందేమోనని అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే దీనిపై క్లారిటీ ఇచ్చింది కంగనా . తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఆమె ఎమర్జెన్సీ సినిమా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా తీయలేదని స్పష్టత నిచ్చింది. ‘సినిమా చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ సినిమా ఎన్నికల సమయంలో విడుదలవుతుందా? కాదా? అన్నది వేరే విషయం. అయితే మా సినిమా ఏ ఎన్నికలకు, రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. దేశానికి మూడు సార్లు ప్రధానిగా ఎన్నికైన ఇందిరాగాంధీకి నివాళులు అర్పించే చిత్రమిది. ఇది ఆమె జీవిత కథ. ఇందులో ఆమె చేసిన మంచి, చెడు అన్నీ ఉన్నాయి. అలాగనీ నేను ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నారని అనుకోవడం సరికాదు’ అని చెప్పుకొచ్చారు కంగనా.

అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ 24న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ఇందిరా గాంధీగా నటించడమే కాకుండా, దర్శక నిర్మాణ బాధ్యతలను కూడా కంగనానే తీసుకుంది. అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, సతీష్ కౌశిక్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును కంగనా స్వాగతించారు. ‘ఇది చారిత్రాత్మకమైన రోజు.. మహిళా సాధికారతకు మరో అడుగు ముందుకు పడింది. మన దేశం సమర్థుల చేతుల్లోనే ఉంది అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం’ అంటూ మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. కాగా కంగనా రనౌత్ గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన తలైవీలో టైటిల్ రోల్ పోషించింది. ఇందులో ఆమె పోషించిన పాత్రకు ప్రశంసలు వచ్చాయి.

ఎమర్జెన్సీ టీజర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.