డాన్సింగ్ దాది.. దీపిక పదుకునేను డామినేట్ చేసిన బామ్మా.. డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే

సినిమాలో పాటలకు డాన్స్ లు చేయడం.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. చాలా కామన్. సినిమాల్లో ఆకట్టుకున్న పాటలను తమ స్టైల్ లో డాన్స్ లు వేస్తూ చాలా మంది..

డాన్సింగ్ దాది.. దీపిక పదుకునేను డామినేట్ చేసిన బామ్మా..  డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే
Deepika Padukone
Rajeev Rayala

|

Jul 09, 2021 | 8:27 PM

సినిమాలో పాటలకు డాన్స్ లు చేయడం.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. చాలా కామన్. సినిమాల్లో ఆకట్టుకున్న పాటలను తమ స్టైల్ లో డాన్స్ లు వేస్తూ చాలా మంది ఈ వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటారు.అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి నేట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో వింతేముంది అనుకుంటున్నారా.. అయితే ఆ డాన్స్ చేసింది ఓ బామ్మా. ఏజ్ జస్ట్ ఏ నెంబర్ అనే దాన్ని ఈ బామ్మా నిజం చేసి చూపించింది. అందమైన పాటకు అద్బుతమైన స్టెప్స్ వేస్తూ.. ఆకట్టుకుంది. ఈ బామ్మాగారి డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే నటించిన బజీరావ్ మస్తాన్ సినిమాలో మోహో రాంగ్ దోలా అనే పాటకు అమేజింగ్ మూమెంట్స్ చేస్తూ ఆకట్టుకుంది ఈ 63 ఏళ్ల బామ్మా.

రవి బాల శర్మ అనే ఈ బామ్మకు సోషల్ మీడియాలో గట్టిఫాలోయింగ్ ఉంది. డాన్సింగ్ దాది అని పిలవబడే రవి బాల శర్మ చాలా వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. వాటిలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు దీపికాతో పోటీపడుతూ బామ్మగారు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నిజంగా అద్బుతమనే చెప్పాలి. గ్రేస్ ఫుల్ స్టెప్స్ తో రవి బాల శర్మ చేసిన డాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలా కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ్ చదవండి :

సర్వాంగ సుందరంగా హనుమంతుడి ఆలయ నిర్మాణం.. 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అర్జున్

Premi Viswanath: సినిమాల్లోకి వంటలక్క.. స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమీ విశ్వనాథ్..?

Evaru Meelo Koteeswarudu: బుల్లితెర పై తారక్ సందడి మొదలవ్వనుంది.. శనివారం నుంచి షూటింగ్ షురూ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu