AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో న్యూ లుక్.. బాలీవుడ్ మూవీ కోసం ఆర్మీ జవాన్ గా మారిన నాగచైతన్య

అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న లవ్ స్టోరీ సినిమాను కంప్లీట్ చేసాడు చైతన్య.

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో న్యూ లుక్.. బాలీవుడ్ మూవీ కోసం ఆర్మీ జవాన్ గా మారిన నాగచైతన్య
Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2021 | 5:23 PM

Share

Naga Chaitanya: అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న లవ్ స్టోరీ సినిమాను కంప్లీట్ చేసాడు చైతన్య. ఆ వెంటనే థాంక్యూ అనే సినిమాను పట్టలేక్కించాడు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మెమరబుల్ మూవీ అందించిన విక్రమ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు చైతన్య. ఇదిలా ఉంటే ఈ కుర్ర హీరో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చ‌ధా సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. చైతూ ఆర్మీ జ‌వాన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అమీర్ ఖాన్ స్నేహితుడిగా క‌నిపించ‌నున్నాడ‌ట చైతూ.

తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫోటోను షేర్ చేశాడు చైతన్య.  ఈ ఫోటోలో అమీర్ ఖాన్ తో పాటుగా ఇటీవల అతని నుంచి విడిపోయిన భార్య కిరణ్ రావు కూడా ఉన్నారు. అలాగే ఆర్మీ జవాన్ గెటప్ లో అమీర్ ఖాన్,నాగ చైతన్య ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకోసం చైతన్య న్యూ లుక్ లోకి మారిపోయాడు.  అంతే కాదు ఇప్పటికే త‌న బాడీ షేప్‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేసుకున్నాడు. 1994లో వ‌చ్చిన అమెరిక‌న్ డ్రామా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్ గా తెర‌కెక్కుతున్నది లాల్ సింగ్ చ‌ధా. క‌రీనాక‌పూర్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. చైతూ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మహేష్‌ను ఢీ కొట్టబోయేది అర్జున్‌ కాదటా.. మరెవరో తెలుసా.?

Mahasamudram : షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన మహాసముద్రం టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

Rakul Preet Singh: అడవిలో అందాల ముద్దుగుమ్మ రకుల్… ఏం చేస్తుందో తెలుసా…?? ( వీడియో )

Follow Us
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?