‘పడుకోవడానికి ప్రశాంతమైన స్థలం లేదు, మీ సినిమా విడుదలైతే థియేటర్ వెళ్తా’.. నెటిజన్‌ ట్వీట్‌కు స్వరా భాస్కర్‌ రిప్లై ఏంటంటే..

Swara Bhaskar: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెటిజన్లు అభిమానులతో నేరుగా మాట్లాడే రోజులు వచ్చేశాయ్‌. ఎలాంటి మొహమాటం లేకుండా ఏది పడితే అది అడుగుతున్నారు...

'పడుకోవడానికి ప్రశాంతమైన స్థలం లేదు, మీ సినిమా విడుదలైతే థియేటర్ వెళ్తా'.. నెటిజన్‌ ట్వీట్‌కు స్వరా భాస్కర్‌ రిప్లై ఏంటంటే..
Follow us

|

Updated on: Aug 06, 2022 | 4:36 PM

Swara Bhaskar: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెటిజన్లు అభిమానులతో నేరుగా మాట్లాడే రోజులు వచ్చేశాయ్‌. ఎలాంటి మొహమాటం లేకుండా ఏది పడితే అది అడుగుతున్నారు. సెలబ్రిటీలు సైతం తమ ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తున్నారు. అయితే తారలు ఇచ్చిన ఈ చనువును కొందరు నెటిజన్లు దుర్వినియోగం చేస్తున్నారు. చనువు ఇచ్చారు కదా అని రెచ్చిపోయి, ఏది పడితే అది అడుగుతున్నారు. కనీసం ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారా.? అని కూడా ఆలోచించకుండా కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ స్వరా భాస్కర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

స్వరా భాస్కర్‌ నటించిన తాజా చిత్రం ‘జహా చార్‌ యార్‌’ సెప్టెంబర్‌ 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే అందులో ఓ నెటిజన్‌ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ‘ప్రస్తుతం మా అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాబట్టి నిద్రించడానికి ప్రశాంతమైన స్థలం దొరకట్లేదు. మీ సినిమా విడుదలైతే వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నా’ అంటూ కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ ట్వీట్‌కు బదులిచ్చిన స్వరా భాస్కర్ స్పందిస్తూ.. ‘మీరు చాలా ప్రాక్టీస్ చేసి, రిహార్సల్ చేసిన జోక్‌ను ల్యాండ్ చేయడానికి ట్విట్టర్ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను కూడా ప్రత్యుత్తరం ఇచ్చానని మీలాంటి అబ్బాయిలకు చూపించండి’ అంటూ రిప్లై ఇచ్చిందీ అందాల తార దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టిం వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..