Kangana Ranaut: ఉన్నదంతా తాకట్టు పెట్టి ఈ సినిమా తీస్తున్నా, తేడా కొడితే ఇక అంతే. కంగనా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

కంగనా రనౌత్.. సగటు ఇండియన్‌ సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే బ్యూటీ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్‌తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది...

Kangana Ranaut: ఉన్నదంతా తాకట్టు పెట్టి ఈ సినిమా తీస్తున్నా, తేడా కొడితే ఇక అంతే. కంగనా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Kangana Ranaut
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 20, 2023 | 9:25 AM

కంగనా రనౌత్.. సగటు ఇండియన్‌ సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే బ్యూటీ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్‌తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. మొన్నటి వరకు ముంబై ప్రభుత్వం పలు వ్యాఖ్యలు చేసిన కంగనా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు నటిగా మెప్పించిన ఈ బ్యూటీ తొలిసారి తనలోని మరో ట్యాలెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కంగనా స్వయంగా దర్శకత్వం వహిస్తూ, తానే నిర్మాతగా వ్యవహరిస్తూ.. ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

1975 నాటి ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే కంగనా.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాకు సంబంధించిన విషయాలను సైతం పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తాను గతంలో పాల్గొన్న పలు ఇంటర్వ్యూలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేశారు.

ఇందులో కంగనా తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి పంచుకున్నారు. తన వంట చేయడం చాలా ఇష్టమని, అందుకే రెస్టారంట్‌ ప్రారంభించాలనుకుందటా.. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఆ ప్రయత్నం నెరవేరలేదని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ చిత్ర నిర్మాణం కోసం ఇంటితో సహా విలువైన వస్తువులన్నీ తాకట్టు పెట్టి మరీ ఈ సినిమా నిర్మిస్తున్నానని తెలిపారు. ఇక చేతిలో ఐదువందల రూపాయలతో ముంబయి నగరానికి వచ్చానని, ఒకవేళ ఎమర్జెన్సీతో మొత్తం కోల్పోతే మళ్లీ మొదటి పరిస్థితికే వస్తానని కంగనా చెప్పుకొచ్చింది. ఇలా జరిగినా తాను ఆత్మవిశ్వాసం కోల్పోనని చెప్పుకొచ్చిన కంగనా.. తన కాళ్లపై నిలబడతాననే నమ్మకం ఉందని సదరు వీడియోలో ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..