Mohan Babu: ఆ బాధ ఇప్పటికీ ఉంది.. మెగాస్టార్ చిరంజీవితో విభేదాలపై మోహన్ బాబు ఇంకా ఏమన్నారంటే?
సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈవిషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈవిషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే గతంలో కొన్ని విషయాల్లో చిరంజీవి, మోహన్‌బాబుల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా ‘మా’ ఎన్నికలు మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్లుగా మారాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించారు మోహన్ బాబు. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా ఎన్నికల సమయంలో చిరంజీవికి, మీకు మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లు అందరూ అనుకున్నారు కదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ ఆ బాధ ఇప్పటికీ నా మనసులో ఉంది. అలా ఎందుకు జరిగింది? అది తన తప్పా? నా తప్పా? అనేది చర్చించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మేమిద్దరం ఎన్నో వందలసార్లు ఎదురుపడ్డాం. మంచి చెడ్డా, మాట్లాడుకున్నాం. మా మధ్య ఏమీ లేదు. బయటవాళ్లు అనుకోవడం మాత్రమే’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వజ్రోత్సవ వేడుకల సమయంలోనూ చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటు చేసుకున్న సంఘటనలను ఎవరూ మర్చిపోలేరు. దీనిపై మాట్లాడిన కలెక్షన్ కింగ్.. ‘సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి. నిజాలేంటి, అసత్యాలేంటి? ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయి. భారత, రామాయణం చూసాం. కాబట్టి అది నథింగ్. ఆ విషయాలు వద్దు’ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..