AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara: బింబిసార అభిమానులకు పండుగ లాంటి వార్త.. అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌..

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన బింబిసార ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బింబిసారుడు అనే రాజు కథను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. వశిష్ట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో..

Bimbisara: బింబిసార అభిమానులకు పండుగ లాంటి వార్త.. అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌..
Bimbisara Sequel Movie
Narender Vaitla
|

Updated on: Oct 28, 2022 | 8:14 PM

Share

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన బింబిసార ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బింబిసారుడు అనే రాజు కథను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. వశిష్ట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైమ్ ట్రావెలింగ్‌ సబ్జెక్ట్‌ను చాలా ఆసక్తికరంగా చూపించాడు. తక్కువ బడ్జెట్‌లోనే భారీ విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీని సైతం మెస్మరైజ్‌ చేసింది. బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన నాటి నుంచి.. బింబిసారా సీక్వెల్‌కు సంబంధించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే తాజాగా దర్శకుడు సీక్వెల్‌పై ఎట్టకేలకు అధికారికంగా స్పందించాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బింబిసార సీక్వెల్‌ ఉంటుందనే విషయాన్ని ప్రకటించాడు.

ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ.. ‘బింబిసారను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులు ప్రస్తుతం సీక్వెల్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే బింబిసార సీక్వెల్‌ను తెరకెక్కించనున్నాము’ అని చెప్పుకొచ్చారు. అయితే కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత బింబిసార-2 షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం నవీన్‌ మేడారం దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి