AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: ‘అప్పుడు నేను హిందీలో మాట్లాడితే విజయ్ ఎగతాళి చేశాడు’.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

బెంగాలీ నటి మాలోబికా బెనర్జీ విజయ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ కు హిందీ అర్థం కాదని.. ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడేవాడు అని అన్నారు. గతంలో రౌడీతో కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.

Vijay Deverakonda: 'అప్పుడు నేను హిందీలో మాట్లాడితే విజయ్ ఎగతాళి చేశాడు'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Vijay Deverakonda,malobika
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2022 | 7:29 PM

Share

లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరొకొండ. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ సినిమాతో ఉత్తరాదిలో విజయ్ ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలకు విజయ్ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలో బెంగాలీ నటి మాలోబికా బెనర్జీ విజయ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ కు హిందీ అర్థం కాదని.. ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడేవాడు అని అన్నారు. గతంలో రౌడీతో కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.

” విజయ్ చాలా మంచి వ్యక్తి. అతను చాలా ప్రొఫెషనల్. చేసే పని పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. గతంలో ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే ఆ సాంగ్ షూట్ సమయంలో సెట్ లో ఉన్న వారందరితో నేను హిందీలో మాట్లాడేదాన్ని. అలా విజయ్ తో కూడా హిందీలోనే మాట్లాడాను. కానీ అతడు నా భాష విని ఎగతాళిగా నవ్వేవాడు. నేను మాట్లాడింది అర్థం కాలేదని.. నా భాష కొత్తగా ఉందని అవహేళన చేసేవాడు.

ఇవి కూడా చదవండి

తను మాత్రం అందరితో తెలుగులోనే మాట్లాడేవాడు. అలాంటిది ఇప్పుడు నేరుగా హిందీలో సినిమా చేశాడు. ఇటీవల లైగర్ ట్రైలర్ చూశాను. హిందీ భాషను వెక్కిరించి.. మళ్లీ హిందీలో సినిమా చేస్తున్నాడంటే ఆశ్చర్యపోయాను ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది.