AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: వారానికి 6 లక్షల రెమ్యునరేషన్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి టాలీవుడ్ హీరో భార్య!

ఈ అమ్మడు ఇప్పుడు సీరియల్స్ తో బిజీ బిజీగా ఉంటోంది. కాబట్టి బిగ్ బాస్ లోకి వచ్చేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. వారానికి కనీసం రూ. 6 లక్షలైనా కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

Bigg Boss Telugu 10: వారానికి 6 లక్షల రెమ్యునరేషన్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి టాలీవుడ్ హీరో భార్య!
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Jun 26, 2026 | 12:22 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఎప్పటిలాగే సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 10 ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. అయితే ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో బిగ్ బాస్ మేకర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా కంటెస్టెంట్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫేమ్, క్రేజ్, పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ల కోసం ఎంతైనా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనంటూ సోషల్ మీడియాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ నుంచి వర్ష, పవిత్ర, వర్షిణీ, ఎక్స్ ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, పల్లవి గౌడ, నందూస్ వరల్డ్ ఫేమ్ నందన, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కల్యాణ్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణీ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌ తదితరుల పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో కనిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారో తెలియదు కానీ ఒక సీరియల్ హీరోయిన్ మాత్రం ఈసారి పక్కాగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

గతంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్ గా వచ్చాడు అమర్ దీప్. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానులు మనసులు గెల్చుకున్నాడు. రన్నరప్‌ గా నిలిచి జస్ట్ త్రుటిలో టైటిల్ కోల్పోయాడు. ఇప్పుడు అమర్ దీప్ భార్య, సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ బిగ్ బాస్ 10లోకి రానుందని సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ సీరియల్స్ తో బిజీ బిజీగా ఉంటోంది. దీంతో వీటిని వదులుకుని బిగ్ బాస్ లోకి వచ్చేందుకు ఈ అమ్మడు భారీ మొత్తం డిమాండ్ చేసిందట. వారానికి కనీసం రూ.6 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అడిగిందట తేజు. అయితే ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆ భారీ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారట.

ఇవి కూడా చదవండి

తేజస్విని గౌడకు తెలుగులో ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉంది. సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి తేజును బిగ్ బాస్ లోకి తీసుకొస్తే టీఆర్పీ రేటింగ్స్ బాగా వస్తాయిన బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారు.

View this post on Instagram

A post shared by zeetamil (@zeetamizh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us