AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss OTT: ‘సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని హాస్టల్‌లో ఉంచాను’.. యాంకర్‌ భర్త ఆసక్తికర కామెంట్స్‌..

Bigg Boss Telugu OTT: ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో లేటెస్ట్‌గా 'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌' పేరుతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ నిర్వాహకులు చేపట్టిన ఈ షో విజయంతంగా..

Bigg Boss OTT: 'సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని హాస్టల్‌లో ఉంచాను'.. యాంకర్‌ భర్త ఆసక్తికర కామెంట్స్‌..
Narender Vaitla
|

Updated on: Mar 27, 2022 | 9:24 AM

Share

Bigg Boss Telugu OTT: ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో లేటెస్ట్‌గా ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ పేరుతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ నిర్వాహకులు చేపట్టిన ఈ షో విజయంతంగా దూసుకుపోతోంది. ఈ రియాలిటీ షో ద్వారా చొక్కారపు స్రవంతి (Sravanthi Chokkarapu) అనే యాంకర్‌ ప్రేక్షకులకు పరిచయమైంది. నిజానికి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అంతకు ముందే కొందరికి పరిచయమైన స్రవంతి బిగ్‌బాస్‌తో (Biggboss) అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేకంటే ముందే స్రవంతి సోషల్‌ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది. తన హాట్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌజ్‌లో సందడి చేస్తున్న ఈ యాంకర్‌పై నెట్టింట పలు రకాల ట్రోల్స్‌ అవుతున్నాయి. ముఖ్యంగా తన ఆట తాను ఆడకుండా అఖిల్‌ పేరును పదే పదే తలుస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా స్రవంతి భర్త ప్రశాంత్‌ ఈ ట్రోలింగ్స్‌తో పాటు తమ వివాహానికి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్రవంతికి బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లోనే అవకాశం వచ్చిందని కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో వెళ్లలేదని చెప్పుకొచ్చారు.

Sravanthi Chokkarapu

ఇక నాటకీయ పరిణామాల నడుమ జరిగిన తమ వివాహం గురించి తెలుపుతూ.. ‘కొందరిని నమ్మి.. బిజినెస్‌లో చాలా నష్టపోయాను. ఇదే సమయంలో నేను, స్రవంతి ప్రేమలో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో స్రవంతి ఫోన్‌ చేసి ‘ఇంట్లో పెళ్లి చేస్తామంటున్నారు, భయం వేస్తోందని చెప్పింది’ దీంతో వెంటనే రహస్యంగా వివాహం చేసుకున్నాం. పెళ్లి తర్వాత స్రవంతిని హాస్టల్‌లో ఉంచాను, కొన్నాళ్లకు అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నాము’ అని చెప్పుకొచ్చాడు.

Also Read: Gold Limit: ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు..? టాక్స్ అధికారులు పెట్టిన లిమిట్ ఎంతో తెలుసా..

Health News: త్వరలో ఆయుర్వేద పద్దతిలో గర్భనిరోధక మాత్రలు.. పేటెంట్‌ లభించింది..!

Maize Farming: మొక్కజొన్నకి పెరిగిన డిమాండ్‌.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ..!