Pushpa 2: సుకుమార్ భారీ ప్లాన్.. పుష్ప సీక్వెల్‌లో సమంత.. కానీ ఈసారి మాత్రం ఇలా..
Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది...
Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నార్త్ నుంచి సౌత్ వరకు విడుదలైన అన్ని చోట్ల పుష్ప అనూహ్య విజయాన్ని అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆదరించారు. దీంతో రికార్డు కలెక్షన్లు రాబట్టిందీ సినిమా. అంతేనా ఒక్క సినిమాతో అల్లు అర్జున్‌ను పైకి ఎక్కిచ్చింది. ముఖ్యంగా సినిమాలో బన్నీ యాక్టింగ్, డైలాగ్స్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు స్లోగా సాగుతోన్న సినిమా ప్రమోషన్స్, ఈ పాట విడుదలతో స్పీడు పెరిగింది. సమంతకు కూడా ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. సామ్ స్టెప్పులు, దేవీశ్రీ మ్యూజిక్ పాటకు హైలెట్‌గా నిలిచాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప సీక్వెల్ తెరకెక్కుతోంది. పుష్ప తొలి పార్ట్ అనూహ్య విజయాన్ని దక్కించుకోవడంతో సీక్వెల్‌లో ప్రత్యేక దృష్టి సారించాడు దర్శకుడు సుకుమార్. ఇందులో భాగంగానే సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప2లో కూడా ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ ఐటెం సాంగ్‌లో సమంత నటించడం లేదని. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తున్నట్లు గత కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకనట రాలేదు. ఇదిలా ఉంటే పుష్ప సీక్వెల్‌లోనూ సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సమంత ఐటెం సాంగ్‌లో కాకుండా స్పెషల్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. సమంత కోసం సుకుమార్ ప్రత్యేకంగా పాత్రను రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ పుష్ప సీక్వెల్‌లో సమంత ఏ పాత్రలో నటిస్తోందన్న దానిపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వచేసే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన మహేష్..
Funny Video: ఓరి దీని ఏశాలో.. ఈ కుక్కకు నిజంగా ‘ఆస్కార్’ అవార్డ్ ఇవ్వాల్సిందే..!
Ashwagandha: అశ్వగంధ పురుషులకు దివ్య ఔషధం.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!