AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.

Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన మహేష్..
Mahesh
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2022 | 7:45 AM

Share

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. మహేష్ ట్విట్టర్ లో రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్ తన సినిమాలతో పాటు ఇతర సినిమాల పై కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటాడు. తాజాగా ఆర్ఆర్ఆర్(RRR) సినిమా పై మహేష్ స్పందించారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద వినీ ఎరుగని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న ట్రిపుల్ ఆర్(RRR) ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ వర్గాలని ఈ మూవీ షాక్ కు గురిచేస్తోంది.

టాలీవుడ్ మెగాస్టార్ రిలీజ్ రోజే సినిమా చూసి సినిమా ఓ అద్భుతం అని ప్రశంసించారు. మెగాస్టార్ తో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక బన్నీ కూడా ప్రత్యేకంగా తన ఫ్యామిలీతో కలిసి చూసి ప్రశంసలు కురిపించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపాడు.  ట్రిపుల్ ఆర్ ఎపిక్ అని గ్రాండియర్ విజువల్స్ మ్యూజిక్ ఎమోషన్స్ ఊహకు అందనివని ఉత్కంఠభరితమైనవి అద్భుతమైనవి అంటూ పొగడ్తలు కురిపించాడు మహేష్. సినిమాలో మిమ్మల్ని మీరు మర్చిపోయే సన్నివేవాలు వున్నాయని. ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే ఇలాంటి సినిమా చేయగలడు. సెన్సేషనల్ ఫీల్మ్ మేకర్ రాజమౌళి సార్ ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా వుంది. తారక్ రామ్ చరణ్ వారి స్టార్ డమ్ ని మించి ఎదుగుతున్నారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు అని అన్నాడు మహేష్. అలాగే నాటు నాటు పాటలో నేల మీద కాకుండా ఇద్దరూ గాల్లో ఎగురుతున్నట్టుగా అనిపించింది అని. ఈ స్థాయి భారీ ప్రాజెక్ట్ ని సమర్థవంతంగా తెరపైకి తీసుకొచ్చినందుకు ట్రిపుల్ ఆర్ టీమ్ కి హ్యాట్సాఫ్. అంటూ ట్వీట్ చేశాడు మహేష్. ఇక రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..