AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారు.. బీజేపీ జాతీయ సంస్కృతి కార్యక్రమంలో మోహన్ బాబు కామెంట్స్

సినీ నటుడు మోహన్ బాబు సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పై ప్రశంసలు కురిపించారు కలెక్షన్ కింగ్.

Mohan Babu: ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారు.. బీజేపీ జాతీయ సంస్కృతి కార్యక్రమంలో మోహన్ బాబు కామెంట్స్
Mohan Babu
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2022 | 6:57 AM

Share

Mohan Babu : సినీ నటుడు మోహన్ బాబు సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పై ప్రశంసలు కురిపించారు కలెక్షన్ కింగ్. బీజేపీ జాతీయ సంస్కృతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సభలో ప్రధాని నరేంద్ర మోదీకి జై కొట్టారు మోహన్ బాబు. బిజెపి జాతీయ సంస్కృతిక మహోత్సవం సభలో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ.. ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో మంత్రి అవంతి శ్రీనివాస్ కు తెలుసు.. తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారని అన్నారు మోహన్ బాబు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళాకారుల్ని ఆదుకునే బాధ్యత తీసుకోవాలని మోహన్ బాబు కోరారు. నృత్య, జానపద కళాకారుల్ని ఆదుకోవడం ఎ.పి, తెలంగాణ నుంచే ప్రారంభించాలని అన్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉండటం వల్లే తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 1998లో నేను ఎ.పి.లో బి.జె.పి.కి ప్రచారం చేస్తే 18శాతం ఓట్లు వచ్చాయి అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఉన్నత పదవులు రావాలని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సి.ఎం జగన్ పై తనకు గౌరవం ఉందని తెలిపారు మోహన్ బాబు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!