AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7: బుల్లి తెరపై బిగ్‌బాస్‌ అరాచకం.. తొలి రోజు ఎంత మంది చూశారో తెలిస్తే..

రేటింగ్స్‌ పరంగా, వ్యూయర్‌ షిప్‌ పరంగా ఊహించని రికార్డులను సొంతం చేసుకుంది. సీజన్‌ సీజన్‌కు ఆదరణ పెంచుకుంటూ పోతున్న బిగ్‌బాస్‌ తాజాగా తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. బిగ్‌బాస్‌కు ఎంతటి ఆదరణ లభిస్తుందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇద్దరిలో ఒకరు బిగ్‌బాస్‌ షోను చూస్తున్నారంటనే బిగ్‌బాస్‌ క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిందే...

Bigg Boss 7: బుల్లి తెరపై బిగ్‌బాస్‌ అరాచకం.. తొలి రోజు ఎంత మంది చూశారో తెలిస్తే..
Bigboss7 Telugu
Narender Vaitla
|

Updated on: Sep 14, 2023 | 9:02 PM

Share

సీజన్‌ సీజన్‌కు బిగ్‌ బాస్‌ క్రేజ్‌ పెరుగుతూనే ఉంది. తాజాగా బిగ్‌బాస్‌ 7 ప్రారంభ ఎపిసోడ్‌కు వచ్చిన ప్రేక్షకాదరణే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఏడో సీజన్‌ అద్భుతమైన రేటింగ్‌తో ప్రారంభమైంది. గడిచిన సీజన్‌తో పోల్చితే ఏకంగా 40 శాతం అధిక రేటింగ్‌ రావడం విశేషం. తొలి రోజునే 29 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.

రేటింగ్స్‌ పరంగా, వ్యూయర్‌ షిప్‌ పరంగా ఊహించని రికార్డులను సొంతం చేసుకుంది. సీజన్‌ సీజన్‌కు ఆదరణ పెంచుకుంటూ పోతున్న బిగ్‌బాస్‌ తాజాగా తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. బిగ్‌బాస్‌కు ఎంతటి ఆదరణ లభిస్తుందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇద్దరిలో ఒకరు బిగ్‌బాస్‌ షోను చూస్తున్నారంటనే బిగ్‌బాస్‌ క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. బిగ్ బాస్ మొదటి వారం ఏకంగా 5.1 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించారని గణంకాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ వ్యూయర్‌ షిప్‌ కారణంగా స్టార్‌ మా టీఆర్‌పీ రేటింగ్స్‌లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్‌బాస్‌ 7 ప్రోమోలో నాగార్జున ఈ సీజన్‌ ఉల్టా పల్టాగా ఉండబోతోంది అని అంచనాలు పెంచేశారు. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బిగ్‌బాస్‌ వ్యూస్‌ దక్కించుకోవడం విశేషం. బిగ్‌బాస్‌ వీకెండ్ సీజన్‌ 7 వీకెండ్‌ ఎపిసోడ్‌ను సరాసరి 7.1 రేటింగ్‌ దక్కింది. హైదరాబాద్‌లో అయితే ఏకంగా 8.7 శాతం రేటింగ్‌ రావడం విశేషం. తొలి వారంలోనే సంచనాలకు కేరాఫ్‌గా మారిన బిగ్‌బాస్‌ 7వ ఎపిసోడ్‌ మున్ముందు మరెన్ని సంచనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటోంది శివాజీనేనని తెలుస్తోంది. ఇండస్ట్రీలో వైరల్‌ అవుతోన్న సమాచారం ప్రకారం శివాజీ వారానికి ఏకంగా రూ. 4 లక్షలుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. శివాజీ స్టార్‌డమ్‌, కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అయిన శివాజీ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొనే అంత రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త కాస్త 7వ సీజన్‌కే హైలెట్‌గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు