AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika: విడుదలకు సిద్ధమైన హన్సిక ఫస్ట్ వెబ్ సిరీస్.. ‘MY3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం అనుకున్నంత స్టార్ డమ్ అందుకోలేకపోయింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ గతేడాది వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయినప్పటికీ కెరీర్ ను కొనసాగిస్తోంది హన్సిక. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

Hansika: విడుదలకు సిద్ధమైన హన్సిక ఫస్ట్ వెబ్ సిరీస్.. 'MY3' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Hansika
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2023 | 9:32 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. ఈ మూవీ బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చేసింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. రామ్ పోతినేని సరసన మస్కా, ప్రభాస్ తో బిల్లా, ఎన్టీఆర్ జోడిగా కంత్రి చిత్రాల్లో నటించింది. అయితే అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం అనుకున్నంత స్టార్ డమ్ అందుకోలేకపోయింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ గతేడాది వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయినప్పటికీ కెరీర్ ను కొనసాగిస్తోంది హన్సిక. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

హన్సిక కీలకపాత్రలో నటించి ఎమ్.వై.3 (MY3) అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. మూగెన్ రావు హీరోగా నటిస్తోన్న ఈ సిరీస్ కు రాజేశ్ ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ మాధ్యామం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో హన్సికతోపాటు శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ బుధవారం రిలీజ్ అయ్యింది.

ఇందులో మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబోగా.. మనిషిగా రెండు పాత్రలు పోషించింది హన్సిక. ఇందులో హన్సిక లుక్, మ్యానరిజం ఆకట్టుకుంటోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు హన్సిక ఇలాంటి పాత్రలో కనిపించలేదని అన్నారు చిత్రయూనిట్. ఇటీవల విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ ఐయామ్ నాట్ ఏ రోబోట్ కు అధికారిక రీమేక్ అన్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us