త్రివిక్రమ్ నా సీన్లను తీసినందుకు బాధపడ్డా: ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’లో తాను నటించిన సన్నివేశాలను తీసేసినందుకు చాలా బాధపడ్డానని నటుడు, బిగ్‌బాస్ 1 కంటెస్టెంట్ ఆదర్శ్ అన్నారు. ఆ మూవీలో ఆఫర్ వచ్చినందుకు తాను ఎంతో సంతోషపడ్డానని.. కానీ తనకు ఎంతో ఇష్టమైన ఓ సన్నివేశాన్ని తీసేయడం బాధ అనిపించిందని తెలిపారు. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆ సీన్ చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని త్రివిక్రమ్‌కు కూడా చెప్పి బాధపడ్డానని ఆదర్శ్ చెప్పుకొచ్చారు. కాగా బిగ్‌బాస్‌తో ఆదర్శ్‌కు మంచి క్రేజ్ […]

త్రివిక్రమ్ నా సీన్లను తీసినందుకు బాధపడ్డా: 'బిగ్‌బాస్' కంటెస్టెంట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 11, 2020 | 8:21 AM

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’లో తాను నటించిన సన్నివేశాలను తీసేసినందుకు చాలా బాధపడ్డానని నటుడు, బిగ్‌బాస్ 1 కంటెస్టెంట్ ఆదర్శ్ అన్నారు. ఆ మూవీలో ఆఫర్ వచ్చినందుకు తాను ఎంతో సంతోషపడ్డానని.. కానీ తనకు ఎంతో ఇష్టమైన ఓ సన్నివేశాన్ని తీసేయడం బాధ అనిపించిందని తెలిపారు. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆ సీన్ చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని త్రివిక్రమ్‌కు కూడా చెప్పి బాధపడ్డానని ఆదర్శ్ చెప్పుకొచ్చారు.

కాగా బిగ్‌బాస్‌తో ఆదర్శ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న తరువాత ఆదర్శ్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. కానీ సెలక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్నారు ఈ నటుడు. ఇక ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఆదర్శ్. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపిస్తోన్న ఈ చిత్రంలో అనసూయ, బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరాఠీలో విజయం సాధించిన నట సామ్రాట్ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.