అవును.. బాలీవుడ్‌లో సినిమా చేస్తున్నా

దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ డీఎస్పీ.. ఈ పేరుకో బ్రాండ్ ఉంది. ఏదైనా పోస్టర్‌‌పై ఆ పేరు ఉందంటే చాలు.. ఆ సినిమా సగం హిట్టు. తన మ్యూజిక్‌తో చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఊపు తెప్పించేస్తుంటారు ఈ సంగీత తరంగం. మాస్ట్రో ఇళయరాజా ఏకలవ్య శిష్యుడిగా తన సంగీతంతో అందరినీ మెప్పిస్తోన్న దేవీ.. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇక తాజాగా మహేష్ […]

అవును.. బాలీవుడ్‌లో సినిమా చేస్తున్నా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 11, 2020 | 9:09 AM

దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ డీఎస్పీ.. ఈ పేరుకో బ్రాండ్ ఉంది. ఏదైనా పోస్టర్‌‌పై ఆ పేరు ఉందంటే చాలు.. ఆ సినిమా సగం హిట్టు. తన మ్యూజిక్‌తో చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఊపు తెప్పించేస్తుంటారు ఈ సంగీత తరంగం. మాస్ట్రో ఇళయరాజా ఏకలవ్య శిష్యుడిగా తన సంగీతంతో అందరినీ మెప్పిస్తోన్న దేవీ.. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇక తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరుకు సంగీతం అందించాడు డీఎస్పీ. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాగా.. దేవీ బ్యాక్‌గ్రౌండ్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దేవీ.

ఇది నా ఫస్ట్ మూవీ అని ప్రతి సినిమాకు భయపడుతుంటా. అది ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఆ భయం మనలో ఉంటేనే ప్రతి సినిమాను ఛాలెంజ్‌లా తీసుకొని చేస్తామని కమల్ హాసన్ గారు నాకు ఓ సందర్భంలో చెప్పారు. అలాగే మా టీమ్ అందరి ఎఫర్ట్ కూడా నా విజయానికి ఓ కారణం అని దేవీ చెప్పుకొచ్చారు. ఇక హీరోగా చేయాలని తనకు ఆఫర్లు వస్తున్నాయని.. తమిళంలో ఎక్కువగా ఈ ఆఫర్లు వస్తున్నాయని.. కానీ మ్యూజిక్ మీద ఇంట్రస్ట్ ఉండటం వల్ల యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు అని దేవీ చెప్పారు. కానీ సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే తప్పకుండా చేస్తానని తెలిపారు. ఇక తరువాత అల్లు అర్జున్- సుకుమార్ చిత్రానికి తాను సంగీతం అందిస్తున్నానని.. ఇందులో మూడు పాటలు కూడా కంపోజ్ చేశానని చెప్పారు. అలాగే కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి, నితిన్-కీర్తి సురేష్‌ల రంగ్‌ దే, పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నానని పేర్కొన్నారు. వీటితో పాటు బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్నానని, దానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.