ఎన్టీఆర్ ప్రేయసితో కలిసి చెర్రీ ఫైటింగ్..!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వికారాబాద్ అటవీ ప్రాంతంలో భారీ ఫైటింగ్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ షెడ్యూల్‌కు గానూ ఎన్టీఆర్‌కు బ్రేక్ ఇవ్వగా.. రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు జక్కన్న. తాజా సమాచారం ప్రకారం ఈ ఫైటింగ్ […]
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వికారాబాద్ అటవీ ప్రాంతంలో భారీ ఫైటింగ్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ షెడ్యూల్‌కు గానూ ఎన్టీఆర్‌కు బ్రేక్ ఇవ్వగా.. రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు జక్కన్న. తాజా సమాచారం ప్రకారం ఈ ఫైటింగ్ సీన్లలో ఒలివియా మోరిస్ కూడా భాగమైనట్లు తెలుస్తోంది. ఆమెతో కలిసి చెర్రీ ఫైటింగ్ చేస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమాలో ఒలివియా, ఎన్టీఆర్ ప్రేయసిగా నటించనున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే పండుగ తరువాత ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ 90శాతం పూర్తి కానుందని, అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాలో అలియా భట్‌కు సంబంధించిన సీన్లు ఎప్పుడో పూర్తి కాగా.. మరో కీలక పాత్రలో కనిపించబోతున్న అజయ్ దేవగన్ షూటింగ్ జనవరి చివరకు పూర్తి అవ్వనున్నట్లు టాక్. కాగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.