షూటింగ్‌లకు బ్రేక్.. ఇర్ఫాన్‌కు మళ్లీ ఏమైంది..!
అరుదైన న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆ మధ్యన లండన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లలో పాల్గొన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇర్ఫాన్ మళ్లీ అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. అందుకే షూటింగ్‌కు మళ్లీ గ్యాప్ తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఆయన హిందీ మీడియం సీక్వెల్ ఆంగ్రేజీ మీడియంలో నటిస్తుండగా.. డాక్టర్ల సూచన మేరకు ఆ మూవీ […]
అరుదైన న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆ మధ్యన లండన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లలో పాల్గొన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇర్ఫాన్ మళ్లీ అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. అందుకే షూటింగ్‌కు మళ్లీ గ్యాప్ తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఆయన హిందీ మీడియం సీక్వెల్ ఆంగ్రేజీ మీడియంలో నటిస్తుండగా.. డాక్టర్ల సూచన మేరకు ఆ మూవీ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. ఇంకా ఆయన ఆరోగ్యం పరిస్థితి సరిగా లేకపోవడంతోనే డాక్టర్లు రెస్ట్ చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
కాగా తాను తనకు అరుదైన న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్ వచ్చినట్లు 2017లో ఇర్ఫాన్ ఖాన్ ప్రకటించారు. ఈ వార్త ఆయన ఫ్యాన్స్‌ను, సినీ ప్రేక్షకులను చాలా కలవరపరిచింది. ఆ తరువాత చికిత్స నిమిత్తం ఇర్ఫాన్ లండన్‌కు వెళ్లారు. అయితే ఈ వ్యాధి ఇంకా పూర్తిగా నయం కాకపోవడం, ఇర్ఫాన్ తరచూ కాస్త అనారోగ్యానికి గురవ్వడంతో డాక్టర్లు మళ్లీ విశ్రాంతిని సూచించినట్లు టాక్. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఇర్ఫాన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.