AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: జానీ మాస్టర్‌కు నేషనల్ ఫిల్మ్‌ అవార్డు రద్దు.. సందిగ్ధంలో మధ్యంతర బెయిల్‌!

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని భారీ షాక్‌ తగిలించింది. కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్‌ అవార్డు రద్దు చేసింది.

Jani Master: జానీ మాస్టర్‌కు నేషనల్ ఫిల్మ్‌ అవార్డు రద్దు.. సందిగ్ధంలో మధ్యంతర బెయిల్‌!
Jani Master
Balaraju Goud
|

Updated on: Oct 05, 2024 | 11:38 PM

Share

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని భారీ షాక్‌ తగిలించింది. అత్యాచారం కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్‌ అవార్డు రద్దు చేసింది. పోక్సో కేసు నమోదు కావడంతో అవార్డు రద్దుచేసినట్టు కమిటీ పేర్కొంది. తమిళ చిత్రం ‘తిరుచిట్రంబలం’ సినిమాకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకోబోతున్నారు జానీ మాస్టర్. 2022 సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎంపికైన జానీ మాస్టర్‌, అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. అయితే అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్‌పై సందిగ్ధంలో పడింది.

ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. లైంగికంగా వేధించి.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడన్నది బాధితురాలి ఆరోపణ. హైదరాబాద్‌, ముంబైతోపాటు ఔట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు లైంగిక దాడి చేసేవాడని కంప్లైంట్‌లో పేర్కొంది. వేధింపులే కాదు.. జానీ, అతని భార్య కొట్టేవారని, చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించారంటోంది బాధితురాలు. వీటిన్నింటిపైనా జానీపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. షూటింగ్‌ సమయంలోనూ వ్యాన్‌లోకి తీసుకెళ్లి బలవంతం చేసేవాడని, ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటోంది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని టార్చర్‌ చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపైనా జానీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు.

అయితే అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోమధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు జానీ మాస్టర్. దీంతో జానీ మాస్టర్‌కు నాలుగు రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదని కోర్టు షరతు విధించింది.

National Award Cancelled

National Award Cancelled

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?