Mallika Sherawat: అర్దరాత్రి ఆ స్టార్ నటుడు నా గది తలుపులు తట్టాడు.. హీరోయిన్ మల్లికా షెరావత్..

ఈ క్రమంలోనే కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. ఇండస్ట్రీలో తనకు ఒకటి రెండు కాదు.. ఎన్నో సమస్యలు వచ్చాయని తెలిపింది. సినీరంగంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడింది. సినిమా షూటింగ్ కోసం మల్లిక దేశ, విదేశాలకు వెళ్లేది.

Mallika Sherawat: అర్దరాత్రి ఆ స్టార్ నటుడు నా గది తలుపులు తట్టాడు.. హీరోయిన్ మల్లికా షెరావత్..
Mallika Sherawat
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 05, 2024 | 9:35 PM

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ ద్వారా చాలా ఫేమస్ అయిన హీరోయిన్లలో మల్లికా షెరావత్ ఒకరు. అప్పట్లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సినిమాల్లో అసలు కనిపించడం లేదు. చాలా కాలంగా సినీరంగుల ప్రపంచానికి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కొన్నేళ్లకు ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ సినిమాతో ప్రేక్ష కుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. ఇండస్ట్రీలో తనకు ఒకటి రెండు కాదు.. ఎన్నో సమస్యలు వచ్చాయని తెలిపింది. సినీరంగంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడింది. సినిమా షూటింగ్ కోసం మల్లిక దేశ, విదేశాలకు వెళ్లేది.

అయితే ఓ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందంతో కలిసి దుబాయ్ వెళ్లింది మల్లికా. భారీ బడ్జెట్ మూవీ కావడంతో కొద్ది రోజులు అక్కడే ఉన్నానని.. ఆ సమయంలో ఓ స్టార్ హీరో తనను వేధించాడని చెప్పుకొచ్చింది. “నేను దుబాయ్‌లో ఓ పెద్ద సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. ఈ మూవీలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనాలు మంచిగా ఆదరించారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందులో నేను కామెడీ రోల్ చేశాను. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఆ సినిమా హీరో అర్ధరాత్రి వచ్చి నా గది తలుపు తట్టాడు. అతడు తలుపు బద్దలు కొడతాడేమోనని భయపడ్డాను. గట్టిగా తలుపులు తలుపు కొట్టేవాడు. అతడు నా గదికి రాకూడదని అనుకున్నాను. ఆ ఘటన తర్వాత మళ్లీ ఆ హీరోతో కలిసి పనిచేయలేదు” అంటూ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో మల్లికాకు ఇలాంటి చేదు ఘటనలు జరగడం మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. మల్లిక ఎక్కడా హీరో పేరు వెల్లడించలేదు. ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ సినిమా అక్టోబ ర్ 11న విడుదల కానుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ హిందీలో నటిస్తుంది మల్లిక. ఇందులో త్రిప్తి డిమ్రీ, రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2003లో సినిమా రంగ ప్రవేశం చేసిన మల్లికా.. ‘క్వాహిష్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా మెరిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్