Bigg Boss 8 Telugu: మణికంఠను ఏడిపించేసిన హౌస్మేట్స్.. ప్రేమ విషయం బయటపెట్టిన యష్మీ..
ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నానని.. ఆ తర్వాత అది జపనీస్ భాష అని తెలిసిందని.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్ తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉందని.. మిస్ అవుతున్నానని మెసేజ్ పంపాడు.
డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటూ ఈ వారం బిగ్బాస్ వీకెండ్ ఎపిసోడ్ పై మంచి బజ్ నెలకొంది. ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో ఆదిత్య ఓంను బయటకు పంపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆదిత్యను స్టేజ్ పైకి తీసుకువచ్చారు నాగార్జున. ముందుగా మెగా చీఫ్ నబీల్ ను నిల్చోబెట్టి చప్పట్లు కొట్టించారు. పృథ్వీ చేతులపై గోల్డెన్ బ్యాండ్ ను తొడిగించారు. ముందు ముందు క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ గేమ్ అదరగొట్టేస్తున్నావంటూ పొడిగేశాడు. ఇక ఆ తర్వాత మణికంఠతో నాగార్జున మాట్లాడటం స్టార్ట్ చేయగానే హేళనగా నవ్వడం స్టార్ట్ చేశారు హౌస్మేట్స్. ఏంటి మణికంఠ కంగారు పడుతున్నావా ? అని నాగార్జున అడగ్గా.. మీరు మంచి విషయం చెప్పినా కూడా అతను అలాగే ఉంటాడు అని ప్రేరణ చెప్పింది. ఇక తర్వాత యాక్షన్ రూంలోకి మణికంఠను పిలిచి ముందు టిష్యూస్ పెట్టి ఎంత ఏడవాలనుకుంటున్నావో ఏడ్చేయ్.. కానీ ఆ తర్వాత ఏడవద్దు అంటూ క్లాస్ తీసుకున్నాడు. అయినా మణికి కన్నీటి చుక్క రాలేదు. నీ భార్య నీ దగ్గరకు రానంటే ఏం చేస్తావ్ ? నీకు ఫుడ్ పంపింది నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావంటూ సీరియస్ అయ్యాడు.
ఇక మణికి నాగార్జున క్లాస్ తీసుకున్న తర్వాత హౌస్మేట్స్ కూడా అతడినే టార్గెట్ చేశారు. అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడు అని ప్రేరణ చెప్పింది. మణి సెల్ఫిష్ అని విష్ణు, పృథ్వీ అన్నారు. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందని నబీల్ చెప్పగా.. మణి ప్రవర్తను తనకు అన్నోయింగ్ గా అనిపిస్తుందని చెప్పింది. ప్రేరణ సెల్ఫిష్ అని చెప్పింది. ఇక యష్మికి తన తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు.. కాకపోతే ఇప్పటివరకు ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు. దీంతో కాలేజీలో ప్రేమ, బ్రేకప్ విషయం చెప్పేసింది. ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నానని.. ఆ తర్వాత అది జపనీస్ భాష అని తెలిసిందని.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్ తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉందని.. మిస్ అవుతున్నానని మెసేజ్ పంపాడు.
సీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని, అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక తెలిపింది. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ సీరియస్ కావడంతో సీతకు జెలసీ ఎక్కువగా ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదని చెప్పిందని… కిచెన్ లో ప్రేరణ ప్రవర్తన నచ్చలేదని అన్నాడు. ఇక ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓంను స్టేజ్ పైకి పిలిచి హౌస్మేట్స్ తో మాట్లాడించారు నాగ్.
ఆదిత్యకు హగ్ అండ్ పంచ్ గేమ్ ఇవ్వగా.. నబీల్, ప్రేరణ, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, మణికి పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవ లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం మణికంఠ ఏడుపు గురించే ఎక్కువగా సాగింది. మొదటి వారం నుంచి ఏడుస్తూ సింపథి క్రియేట్ చేస్తున్న మణి ఏడుపు సీక్వెన్స్ కు ముగింపు పలికారు నాగ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.