Nandamuri Balakrishna: మరోసారి గాయకుడి అవతారమెత్తనున్న నటసింహం.. అన్నగారి జయంతి సందర్భంగా…

నటసింహం నందమూరి బాలకృష్ణ మరో సారి తన గొంతును సవరించనున్నారు. కరోనా వేళ అందరూ బాగుండాలని కోరుకుంటూ శ్రీరామ దండకాన్ని ఆలపించనున్నారు.

Nandamuri Balakrishna: మరోసారి గాయకుడి అవతారమెత్తనున్న నటసింహం.. అన్నగారి జయంతి సందర్భంగా...
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 12:31 AM

Nandamuri Balakrishna:

నటసింహం నందమూరి బాలకృష్ణ మరో సారి తన గొంతును సవరించనున్నారు. కరోనా వేళ అందరూ బాగుండాలని కోరుకుంటూ శ్రీరామ దండకాన్ని ఆలపించనున్నారు. అందుకోసం ఓ దివ్యమైన ముహుర్తాన్ని ఫిక్స్‌ చేశారు కూడా.. !సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తనలోని గాయకున్ని బయట పెట్టే బాలయ్య.. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా… ఓ పాట పాడనున్నారు. అందరికి అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఆయన పుట్టిన రోజు మే 28న.. ఉదయం 9గంటల 45 నిమిషాలకు.. శ్రీరామ దండకాన్ని ఆలపించనున్నారు. సీనియర్ ఎన్టీఆర్ రాముని గెటప్ ఫోటోలకు బాలయ్య గాత్రంతో వీడియో రిలీజ్ కానుందని నందమూరి అభిమానులు మెచ్చే విధంగా ఈ సర్పైజ్ ఉండబోతుందని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు బాలయ్య.  ఇక ఇంతకు ముందు బాలయ్య తన బర్త్‌ డే సందర్భంగా ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ లోని ‘శివ శంకరీ శివానంద లహరి’ పాటను ఆలపించి యావత్ తెలుగు ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పైసా వసూల్’ చిత్రంలోనూ మాస్ ఆడియన్స్ కోసం ఊపున్న పాటను పాడారు. ఇక ఇప్పుడు మరోసారి తన గొంతుతో అందర్నీ అలరించనున్నారు. అసలు బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి.. లేదా బాలయ్య కొత్త సినిమా గురించి ప్రకటన రాబోతుందని ఎక్సపెక్ట్ చేశారు. కానీ బాలయ్య ఆలపించిన శ్రీరామదండకం అనేసరికి ఆసక్తిగానే ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Megastar Chiranjeevi: మరో రీమేక్ కు సిద్దమవుతున్న మెగాస్టార్.. ఈసారి ప్రభాస్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్న చిరంజీవి..

Zombie Reddy: టెలివిజన్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న జాంబీరెడ్డి… రెండోసారి కూడా అదిరిపోయే టీఆర్ఫీ తెచ్చుకున్న సినిమా..

Hero Karthi: ఖైదీ సినిమా సీక్వెల్ రాబోతుందంట.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. స్క్రిప్ట్ పనులు కూడా అవుతున్నాయట…